Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస పండ్లను ప్రతిరోజూ తింటే...(video)

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో

Jackfruit
Webdunia
మంగళవారం, 17 జులై 2018 (09:24 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో చాలా మంది పనస పండును తినేందుకు ఆసక్తిని చూపిస్తారు.
 
సాధారణంగా ఈ పండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్ల కన్నా భిన్నమైన ప్రయోజనాలను ఈ పండు అందిస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి శక్తినిస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయితే అసలు పనస పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 
 
* పనస పండ్లలో విటమిన్ ఎ, సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. 
* పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. 
* పనస పండులో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. వాపులను తగ్గిస్తుంది. 
* పనస పండ్లలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. 
* టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి. 
* గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హై బీపీ, హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 
* పనస పండును తరచూ తీసుకుంటుంటే అలాంటి ముడతలు ఏర్పడవు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. 
* రుచి తియ్యగా ఉన్నప్పటికీ పనస పండ్లు షుగర్ లెవల్స్‌ను పెంచవు. 
* ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అమాంతం పెరగకుండా చూస్తాయి. 
* డయాబెటిస్ ఉన్న వారు కూడా పనస పండ్లను నిర్భయంగా తినవచ్చు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments