Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస తొనలు తింటే మగవారిలో...

మనం ఇష్టంగా తినే పండ్లలో పనస పండు ఒకటి. ఈ పనస పండు సంపూర్ణమైన మరియు బలవర్దకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ మరియు ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇన్ని

Webdunia
సోమవారం, 16 జులై 2018 (22:00 IST)
మనం ఇష్టంగా తినే పండ్లలో పనస పండు ఒకటి. ఈ పనస పండు సంపూర్ణమైన మరియు బలవర్దకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ మరియు ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇన్ని పోషక విలువలున్న పనసపండు మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
1. పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.
 
2. పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యవృద్ధిని కలిగించి, అంగస్తంభన సమస్యల్ని తగ్గించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.
 
3. ఇది శరీరంలోని రోగ నిరోధరక శక్తిని పెంచుతుంది. శరీరంలోని అనేక రుగ్మతల బారినుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడి డి.ఎన్.ఎ ను డ్యామేజీ బారి నుండి కాపాడుతుంది.
 
4. ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
5. పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.
 
6. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.  
 
7. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
 
8. పనసపండులో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలు పెళుసుగా మారే సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
 
9. పనసపండు చర్మ కాంతిని పెంచుతుంది. చర్మంపై మృత కణాలు తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments