Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎప్పుడైనా నల్లకోడి మాంసం తిన్నారా? (video)

నల్లకోడి మాంసం తిన్నారా..? అసలు నల్లకోడి మాంసం ఎక్కడ అమ్ముతున్నారు.. బ్రాయిలర్ చికెనే కదా తీసుకుంటున్నాం.. అంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. హోటళ్లు, రెస్టారెంట్లలో వారంతపు రోజుల్లో నల్లకోడి చిక

ఎప్పుడైనా నల్లకోడి మాంసం తిన్నారా? (video)
, శనివారం, 14 జులై 2018 (13:59 IST)
నల్లకోడి మాంసం తిన్నారా..? అసలు నల్లకోడి మాంసం ఎక్కడ అమ్ముతున్నారు.. బ్రాయిలర్ చికెనే కదా తీసుకుంటున్నాం.. అంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. హోటళ్లు, రెస్టారెంట్లలో వారంతపు రోజుల్లో నల్లకోడి చికెన్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగిపోతోంది. ఒక్కసారి నల్లకోడి కూర టేస్ట్ చేస్తే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. 
 
ఈ నల్లకోడి కూరలో పోషకాలు పుష్కలం. కొవ్వు స్వల్పం. మాంసకృత్తులు కూడా పుష్కలం. బ్లాక్ చికెన్, కాలామసి అని పిలుచుకునే ఈ కోడిని కృత్రిమంగా బరువు పెంచలేరు. 20 వారాల పాటు పెరిగే ఈ కోడి కూరను టేస్ట్ చేస్తే.. మధుమేహం దూరమవుతుంది. ఈ కోడిలో 0.7 శాతం మాత్రమే కొవ్వు వుంటుంది. 18 శాతం వరకు మాంసకృత్తులు వుంటాయి.
 
అందుచేత రక్తపోటు మధుమేహం, హృద్రోగ సమస్యలతో బాధపడేవారికి ఇది ఆరోగ్యకరమైన ఆహారమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్లలో ఈ కోడి ధర రూ.450 వరకు వుంటుంది. ఈ కోడిని సన్నని సెగపై ఎక్కువ సేపు ఉడికించాలి. అలా చేస్తే ఎముకల్లోని గుజ్జు.. మాంసం రెండూ కలిసి.. అసలు రుచి బయటపడుతుంది. ఈ కోడి మధ్యప్రదేశ్ కడఖ్ నాథ్ ప్రాంతం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేస్తున్నాయి. ఇక పెద్ద పెద్ద హోటళ్లలో ఈ కోడి మాంసం భోజన ప్రియులకు అందుబాటులో వుంటోంది.
 
ఆరోగ్య ప్రయోజనాలు.. 
* యాంటీయాక్సిడెంట్లు పుష్కలం-తద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్ కారకాలు తొలగిపోతాయి. 
* కంటిచూపును మెరుగుపరుస్తుంది. శరీరాన్ని చురుకుగా వుంచేందుకు తోడ్పడుతుంది. 
* కండరాలకు బలాన్నిస్తుంది. 
* రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. తద్వారా డయాబెటిస్‌ను దూరం చేస్తుంది. 
* బరువు తగ్గాలనుకునేవారికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను పక్కనబెడుతుంది. 
* ఇందులోని విటమిన్-బి ధాతువులు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. 
* విటమిన్-ఇ హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది
* ఇంకా బ్లాక్ కోడిలో ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియం పుష్కలంగా వుంటాయి. 
* మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్భాశయ వ్యాధులను నయం చేస్తుంది. 
* జలుబు, తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. 
* నల్లకోడి గుడ్లు తింటే తల తిరగడం వంటి రుగ్మతలను నయం చేసుకోవచ్చు. 
* నల్లకోడి గుడ్లు ఆస్తమాను నిర్మూలిస్తాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాదం ఆకులతో.. చర్మ సమస్యలు మటాష్