Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొబ్బరినూనెలో కాస్త కర్పూరం కలుపుకుని తీసుకుంటే?

నాలుగు చినుకులు మెుదలైతే చాలు జలుబూ, దగ్గు, జ్వరం వంటివి పిల్లల్నే కాదు పెద్దలనీ కూడా బాధిస్తుంది. చిన్నారుల్లో అయితే కొన్నిసార్లు కఫం కూడా పేరుకుని నానా ఇబ్బంది పెడుతుంటుంది. దీనికి వాతావరణంలో మార్పు

కొబ్బరినూనెలో కాస్త కర్పూరం కలుపుకుని తీసుకుంటే?
, శుక్రవారం, 13 జులై 2018 (16:01 IST)
నాలుగు చినుకులు మెుదలైతే చాలు జలుబూ, దగ్గు, జ్వరం వంటివి పిల్లల్నే కాదు పెద్దలనీ కూడా బాధిస్తుంది. చిన్నారుల్లో అయితే కొన్నిసార్లు కఫం కూడా పేరుకుని నానా ఇబ్బంది పెడుతుంటుంది. దీనికి వాతావరణంలో మార్పులు ఒక కారణమైతే రోగనిరోధకశక్తి తగ్గడం మరో కారణం. ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రల అవసరం లేకుండా ఆ సమస్యలను నివారించవచ్చును.
 
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దుమ్మూ, దూళి చేరకుండా చూసుకోవాలి. అలాగే గోడల మీద పైకప్పులో చెమ్మ చేరకుండా జాగ్రత్త పడాలి. లేదంటే తడి, చెమ్మ ఆరకుండా ఉండే ప్రదేశాల్లో సూక్ష్మజీవులు చేరి అవే ఇన్‌ఫెక్షన్, అలర్జీలకు కారణమవుతాయి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. 
 
శరీరంలో కఫాన్ని పెంచే ఆహారపదార్థాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. కేకులు, చాక్లెట్లు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. కొద్దిగా ముద్ద కర్పూరంలో రెండు చెంచాల బియ్యం వేసి కలుపుకుని తెల్లని కాటన్ వస్త్రంలో ఆ మిశ్రమాన్ని మూటకట్టాలి. ఆ మూటను వాసన చూస్తూ ఉంటే శ్వాస తీసుకోవడం తేలికగా ఉంటుంది. వేడి నీళ్లల్లో పసుపు వేసి ఆవిరి పట్టినా మంచిది.
 
కొబ్బరినూనెను వేడిచేసి అందులో కాస్త కర్పూరం కలుపుకోవాలి. అది కరిగిపోయాక ఒక శుభ్రమైన సీసాలో ఆ మిశ్రమాన్ని పోయాలి. ఈ నూనెను అప్పుడప్పుడు పిల్లల ఛాతీపై రాస్తే లోపలి కఫం విడిపోయి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండెకూ ఓ డైట్ ఉంది గురూ?