వేడివేడి బజ్జీలొద్దు.. వేడివేడి సూప్‌లు ట్రై చేయండి..
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. అల్లం, పసుపును వంటల్లో అధికంగా వాడాలి. అల్లంతో చేసిన టీ తాగడం లేదంటే పసుపు కలిపిన పాలు రోజూ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు దూరం అవుతాయి. అలాగే మొలకలూ, మొక్
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. అల్లం, పసుపును వంటల్లో అధికంగా వాడాలి. అల్లంతో చేసిన టీ తాగడం లేదంటే పసుపు కలిపిన పాలు రోజూ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు దూరం అవుతాయి. అలాగే మొలకలూ, మొక్క జొన్న గింజలు కూడా ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పీచు పుష్కలంగా ఉంటుంది. చాట్‌లాగా లేదంటే సలాడ్‌లాగా చేసుకుని తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే వేడివేడి బజ్జీలు, పకోడీల కంటే వేడివేడి సూపులను తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేకూరుతుంది. వాటిలో ఎక్కువగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండేలా చూసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇంకా టొమాటో, క్యారెట్, పుట్టగొడుగుల్లాంటివి కేవలం కూరల్లో చేర్చుకోవడమే కాకుండా ఆవిరి మీద ఉడికించి తినాలి. అప్పుడే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. వాటిని నేరుగా తినలేకపోతే ముక్కలుగా చేసి సలాడ్‌లాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అనారోగ్య సమస్యలు ఏమాత్రం అంటవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.