Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహ వ్యాధులకు నివారిణిగా నేలవాము.....

నేలవాము అడుగు నుండి రెండడుగులు మాత్రమే పెరిగే చిన్న మెుక్క. దీన్ని సర్వరోగనివారిణిగా వర్ణిస్తారు. యునానీ, ఆయుర్వేదం, హోమియో వైద్యంలో వాడే మూలికల్లో నేలవాము అత్యంత ఔషధమైనది. వేపంత చేదుతో ఉండే నేల బారున

మధుమేహ వ్యాధులకు నివారిణిగా నేలవాము.....
, సోమవారం, 16 జులై 2018 (10:13 IST)
నేలవాము అడుగు నుండి రెండడుగులు మాత్రమే పెరిగే చిన్న మెుక్క. దీన్ని సర్వరోగనివారిణిగా వర్ణిస్తారు. యునానీ, ఆయుర్వేదం, హోమియో వైద్యంలో వాడే మూలికల్లో నేలవాము అత్యంత ఔషధమైనది. వేపంత చేదుతో ఉండే నేల బారున పెరిగే మెుక్క కావడంతో దీన్ని నేలవాము అంటారు. క్యాన్సర్ వ్యాధిని నివారించుటలో సహాయపడుతుంది.
 
కాలేయ సంబంధ వ్యాధులకు కూడా ఈ మెుక్క చాలా ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. స్త్రీల వ్యాధుల విషయంలో దీని ఉపయోగం చాలా ఉంది. సాధారణ ఒంటి నొప్పులకు, మలేరియా వంటి జ్వరాలకు ఇది మంచి ఔషధం. రక్తశుద్ధి, వ్యాధినిరోధక శక్తిని పెంచుటలో దోహదపడుతుంది. పిల్లల్లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు ఈ మెుక్క మంచి పరిష్కారం.
 
నేలవాము ఎలాంటి నేలలోనైనా, వాతావరణంలోనైనా పెరుగుతుంది. అయితే తేమగా ఉండే నేల దీనికి అనుకూలంగా ఉంటుంది. పూర్తి ఎండలో కంటే కొద్దిపాటి నీడలో చక్కగా పెరుగుతుంది. దీని కాండం లేతగా, ముదురాకుపచ్చ రంగులో పలకలుగా ఉంటుంది. ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. తెల్లని చిన్న చిన్న పువ్వులు నాలుగు రేకలతో ఊదారంగు చారలతో లేదా చుక్కులతో ముచ్చటగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ అల్లం టీ తీసుకుంటే?