Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (20:57 IST)
కార్తీకమాసం చాలా పవిత్రమైనది. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవదీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీకమాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తే అన్ని శుభాలు చేకూరి మహాశివుని అనుగ్రహం లభిస్తుంది.
 
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. ఈ రోజు ప్రధానంగా తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మెుత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. 
 
ఈ మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించినా, ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగించినా మంచి ఫలితం ఉంటుంది. కార్తీకపౌర్ణమినాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదులలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక సోమవారం.. నువ్వులు దానం చేస్తే?

నవంబర్ 04, 2024- త్రిగ్రాహి యోగం.. కన్యారాశికి అదృష్టమే

04-11- 2024 సోమవారం దినఫలితాలు : సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది...

03-11 - 2024 నుంచి 09-11-2024 వరకు వార ఫలితాలు

03-11-2024 ఆదివారం ఫలితాలు-రుణసమస్యలు తొలగుతాయి

తర్వాతి కథనం
Show comments