లవంగాలు ఎందుకు తీసుకోవాలి?

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (21:59 IST)
లవంగాలు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా, లవంగాలకు వైద్య విలువలు కూడా ఉన్నాయి. లవంగ నూనెను పంటి నొప్పికి మందుగా ఉపయోగిస్తారు. బాగా నలిపిన లవంగ ఆకులు పంటి నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఎసిడిటి మరియు అజీర్ణానికి లవంగ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.

క్వాలిటీ మరియు సీజన్ల బట్టి ధరలు మారుతుంటాయి. రుచి, కారంకోసం కూరలలో ఎక్కువగా వాడుతుంటారు. అటువంటి వంటకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. లవంగాలు వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం!
 
1. లవంగాల నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
 
2. ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి.
 
3. ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.
 
4. జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
5. నిత్యం లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకు మించి వాడితే శరీరం వేడి చేస్తుంది.
 
6. లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.
 
7. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులుమటుమాయమంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: ఫిబ్రవరి 11 నుంచి మున్సిపల్ ఎన్నికలు.. ఫలితాలు ఫిబ్రవరి 13న విడుదల

ఎపుడైనా.. ఎక్కడైనా.. ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్...

ఐదేళ్ల బాలికపై వీధికుక్క దాడి.. చెంపపై కరిచింది..

లోకేశ్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ : బీద రవిచంద్ర

బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

తర్వాతి కథనం
Show comments