ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. బంగారు పాత్రలలో భోజనం చేసేవారికి సకల దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెపుతోంది. ఇక వెండి పాత్రలో భోజనం చేసేవారికి నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. పిత్త వ్యాధులు దరిచేరవు. ఐతే కఫ, వాత వ్యాధులు ఉండేవారు ఈ వెండి పాత్రలలో భోజనం చేయకూడదు.
ఇత్తడి పాత్రలలో భోజనం చేయడం వల్ల క్రిములు నశిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. కఫ వ్యాధులను ఇది నివారిస్తుంది. శోష, పాండు రోగాలను అరికట్టి శరీరానికి బలాన్ని చేకూర్చుతుంది.
ఇకపోతే భోజనం చేసే ప్రతిసారీ కొద్దిగా అన్నంలో అల్లం, సైంధవ లవణము కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్యం. అన్నము మీద ఉన్న అయిష్టతను, అరుచిని ఇవి పోగొడతాయి. నాలుక, కంఠాన్ని ఇవి శుద్ధి చేస్తాయి.