వాతావరణం చల్లగా వున్నా, వర్షం పడుతున్నా కొందరిని జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతుంది. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. మిరియాలు, బెల్లాన్ని కాసింత పరగడపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
2. జీలకర్ర, కలకండను నమిలి తింటే దగ్గు నయం అవుతుంది. నాలుగు మిరియాలు, ఇరు దాల్చిన చెక్కల్ని నెయ్యిలో వేపి పొడి చేసి ఓ తమలపాకులో మడిచి తీసుకుంటే దగ్గును దూరం చేసుకోవచ్చు.
3. నాలుగు మిరియాలు కాసింత బియ్యాన్ని ఉడికించి తీసుకుంటే దగ్గుకు చెక్ పెట్టవచ్చు.
4. బ్రష్ చేసిన తర్వాత తేనెను చిగుళ్లపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే దంతాల్లోని క్రిములు నశిస్తాయి. కొబ్బరి నూనెను రోజుకు వీలైనన్ని సార్లు పెదాలకు రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.
5. తులసీ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని వేడినీటిలో కషాయంలో వేసుకుని తాగితే, లేదా టీ ఆకులతో చేర్చితే ఆకలిలేమిని దూరం చేసుకోవచ్చు.