Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యువును ధిక్కరించే శక్తివంతమైన మొక్క ఇది...

తులసి మెుక్క అందరికీ పరిచితమైన మెుక్క . దేవాలయాలలోను, ఇంటి పెరళ్లలోను, పెంచుతూ, పవిత్రమైన పూజాదళంగా భావించే ఔషధపు మెుక్క ఇది. మృత్యువును ధిక్కరించే శక్తివంతమైనది కనుక తులసి అని, సంవత్సరమంతా సులభంగా లభ్యమవడం వల్ల పావని అని, సువాసన కలిగి ఉండటం వల్ల సు

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:18 IST)
తులసి మెుక్క అందరికీ  పరిచితమైన మెుక్క . దేవాలయాలలోను, ఇంటి పెరళ్లలోను, పెంచుతూ, పవిత్రమైన పూజాదళంగా భావించే ఔషధపు మెుక్క ఇది. మృత్యువును ధిక్కరించే శక్తివంతమైనది కనుక తులసి అని, సంవత్సరమంతా సులభంగా లభ్యమవడం వల్ల పావని అని, సువాసన కలిగి ఉండటం వల్ల సురభీ అని సంస్కృతంలో దీనిని వ్యవహరిస్తారు. ఇలాంటి మహిమాన్వితమైన తులసిని తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం....
 
1. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుంది. 
 
2. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మెుటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు శోభి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి.
 
3. ఒక గ్లాసు నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావుస్పూన్ జీరకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాసు కషాయం మిగిలేలా మరిగించి గోరు వెచ్చగా అయిన తర్వాత వడబోసి, సగం నిమ్మబద్ద రసం, ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణాశయదోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్య వికారాలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
 
4. వారానికి రెండుసార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. 
 
5. రోజుకు ఒకసారి నాలుగైదు స్పూన్ల తులసి రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండ, మూత్రకోశ, మూత్రశయాలలోని రాళ్లు కరిగిపోతాయి.
 
6. నీడలో ఎండించి, వస్త్రగాళితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని అరస్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఇదే చూర్ణాన్ని ముక్కుపొడుంలా పీలుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తమ్ములు శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments