Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుదీనా-నిమ్మరసం-తేనె కలిపి తాగితే...

పుదీనాను ఆహారంగానే చాలామంది వాడుతారు తప్ప దీనిలో అత్యుత్తమ ఔషధ గుణాలున్నాయని అతి కొద్దిమందికే తెలుసు. పుదీనా ఆకులతోచాలా రుచికరమైన పచ్చడి తయారుచేస్తారు. కూరల్లోనూ, పులుసుల్లోనూ దీనిని వాడటంతో పాటు పాలు త్వరగా విరిగిపోకుండా పాలల్లో కూడా ఈ ఆకు వేస్తారు.

Advertiesment
Pudeena health benefits
, శనివారం, 7 ఏప్రియల్ 2018 (17:28 IST)
పుదీనాను ఆహారంగానే చాలామంది వాడుతారు తప్ప దీనిలో అత్యుత్తమ ఔషధ గుణాలున్నాయని అతి కొద్దిమందికే తెలుసు. పుదీనా ఆకులతోచాలా రుచికరమైన పచ్చడి తయారుచేస్తారు. కూరల్లోనూ, పులుసుల్లోనూ దీనిని వాడటంతో పాటు పాలు త్వరగా విరిగిపోకుండా పాలల్లో కూడా ఈ ఆకు వేస్తారు. పుదీనాలో ఉండే పోషకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 
1. పుదీనాలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. వంద గ్రాముల పుదీనాలో దాదాపుగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-బి, బి-2, నియాసిన్‌లు ఉండి 56 కేలరీల శక్తిని ఇస్తుంది.
 
2. రెండు స్పూన్ల పుదీనా రసంలో ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు మూడుసార్లు తాగడం వల్ల కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, కడుపులో నులిపురుగులు తగ్గుతాయి. అజీర్ణ లక్షణాలు దరి చేరవు.
 
3. పుదీనాను ఎండబెట్టి పొడి చేసి రెండు స్పూన్ల పొడిని రెండు గ్లాసుల నీళ్లలో వేసి అరగ్లాసు నీరు మిగిలేవరకు మరిగించి, చల్లార్చి ఆ నీటిని వడకట్టి తాగితే బహిష్టు నొప్పితో బాధపడేవారికి ఆ నొప్పి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా నెలసరి కూడా సక్రమంగా వస్తుంది. ఈ ప్రక్రియను బహిష్టు సమయానికి మూడు నాలుగు రోజుల ముందు నుండి ఆచరించాలి.
 
4. ప్రతిరోజు పుదీనా నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గడంతో పాటు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండి పిప్పిపళ్లు రావడం, చిగుళ్ల నుండి చీము రావడం తగ్గుతాయి. 
 
5. మజ్జిగలో పుదీనాను కలిపి వాడటం వల్ల వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది. పుదీనాను నలిపి వాసన చూస్తుంటే తలనొప్పి, తల తిరగడం తగ్గుతాయి.
 
6. పుదీనా కషాయం రోజుకి మూడుసార్లు సేవిస్తే ఎక్కిళ్లు, దగ్గు, జలుబు తగ్గుతాయి. ఈ కషాయంతో కొద్దిగా ఉప్పు కలిపి కొద్దిసేపు పుక్కిలి పట్టడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లి అయ్యేందుకు మందులెందుకు... ఇవి తీసుకుంటే చాలు...