Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి చేస్తే దెబ్బకి కొవ్వు కరిగిపోతుంది

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (22:19 IST)
శరీరంలో కొవ్వు పేరుకుపోయి సమస్యతో సతమతమవుతుంటారు చాలామంది. ఈ కొవ్వు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకనే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే కొవ్వును కరిగించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో బాగా కలిపి దీన్ని ఉదయం పరగడుపునే తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.
 
2. ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొవ్వు కరుగుతుంది.
 
3. రెండు టేబుల్ స్పూన్ల క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి దీన్ని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
 
4. గోరువెచ్చగా ఉండే ఒక గ్లాస్ నీటిలో అవిసె గింజెల పొడి ఒక టీస్పూన్, తేనె ఒక టీస్పూన్ కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగాలి. ఇది కూడా పొట్ట దగ్గర కొవ్వును బాగా తగ్గిస్తుంది.
 
5. గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో నువ్వుల నూనె ఒక టీస్పూన్, అల్లం రసం ఒక టీస్పూన్ మోతాదులో కలిపి రోజుకు రెండుసార్లు దీన్ని తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది.
 
6. గ్రీన్ టీ పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1/4 టీస్పూన్, తేనె 2 టీస్పూన్లు తీసుకుని వీటిని ఒక గ్లాస్ నీటిలో కలపాలి. 3 నిమిషాల పాటు ఇలా చేయాలి. దీన్ని రోజుకి రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments