జీవనశైలి మారింది. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఫలితంగా బరువు పెరగడం జరుగుతోంది. ఒబిసిటీతో బాధపడేవారు.. పెరిగిన పొట్టతో తప్పకుండా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఒబిసిటీ కారణంగా మనిషి ఆకృతిలో బాగా ఇబ్బందిపెట్టేది పొట్ట భాగమే. కాస్త లావైనా వెంటనే పొట్ట ముందుకు పొడుచుకు వస్తుంది. ఇక ఆ తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
అందుకే పొట్టను నియంత్రించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్ట పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరుగుతాయని.. అందుకే ఒబిసిటీని నియంత్రించడంతో పాటు పొట్ట పెరగకుండా సరైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే పొట్ట పెరగకుండా ఉండాలంటే.. ఏం చేయాలో చూద్దాం.
ఉప్పు తగ్గించాలి
మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పు. ఉప్పు ఎంత తగ్గుతుందో అంతగా పొట్ట పెరగకుండా ఉంటుంది. దానికి తోడు బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
బాగా నిద్రపోవాలి
మీ పొట్టను కరిగించుకోవాలంటే నిద్ర తప్పనిసరి. రోజుకు 8 గంటలు తప్పక నిద్రపోవాలి. పొట్ట తగ్గాలనుకునేవారు పొట్ట తగ్గడం కోసం బోర్లా పడుకుని నిద్రించడం మంచిది. తద్వారా పొట్ట కండరాలు లోనికి చొచ్చుకోవడం ద్వారా కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది.
కూరగాయలు తినాలి
మీరు ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. తాజాగా ఉండేలా చూసుకోవాలి. బ్రొకోలి, కాకరకాయ, క్యాబేజ్ జ్యూస్ వంటివి తీసుకోవడం ద్వారా మీరు త్వరగా బరువు తగ్గడానికి పొట్టకరిగించుకోవడానికి సహాయపడుతాయి.
ఫ్యాట్ ఫుడ్స్ వద్దు
పొట్ట తగ్గాలంటే.. కచ్చితంగా ఫ్యాట్ ఫుడ్స్‌ను తినడం పూర్తిగా నివారించాలి. జంక్ ఫుడ్, ఫ్త్రెడ్ ఫుడ్, చిప్స్ వంటి వాటికి మీరు దూరంగా ఉండాల్సిందే.
పొట్టకు సంబంధించిన వ్యాయామాలు
మీకు సమయం దొరికినప్పుడల్లా మీ బెల్లీ తగ్గడానికి, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. మీ నడుమును సైడ్ టు సైడ్ తిప్పుతుండాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ వ్యాయామం.
లోతుగా శ్వాస పీల్చండి
మెడిటేషన్ భంగిమలో లోతుగా శ్వాస పీల్చడం వల్ల పొట్టను తగ్గించుకోవచ్చు. శ్వాస వ్యాయామాన్ని పాటించడం ద్వారా కూడా పొట్టను తగ్గించుకోవచ్చు.
పొటాషియంను పెంచండి
మీ బెల్లీ తగ్గించుకోవాలంటే, మీరు తీసుకొనే పొటాషియం కంటెంట్‌ను పెంచాలి. శరీరంలో తక్కువ పొటాషియం ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటానికి కారణం అవుతుందని, నిపుణుల అభిప్రాయం.
ఎక్కువ ద్రవాలు
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే నీళ్ళు మీ బ్రెస్ట్ ఫ్రెండ్ వంటిది. ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల ఫ్లాట్ బెల్లీని పొందవచ్చు. రోజుకు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగితే పొట్ట తగ్గుతుంది.
సైక్లింగ్
సైక్లింగ్ ద్వారా పొట్టను బాగా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఓ గంట పాటు సైక్లింగ్ చేయడం ద్వారా కేవలం 14 రోజుల్లోనే శరీరాకృతిలో మార్పును మీరు గమనించవచ్చును.
వాటర్ ఫుడ్స్
నీరు అధికంగా ఉండే ఆహారాలు, పుచ్చకాయలు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడి, బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
నిదానంగా తినాలి
మీరు తీసుకొనే ఆహారం చాలా నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు నిదానంగా తినడం మొదలు పెట్టి, అలవాటుగా మార్చుకుంటారో, పేగులకు జీర్ణించే శ్రమ తగ్గి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నడక
రోజూ అరగంట పాటు స్నేహితులతో లేదా మీ భాగస్వామితో కలిసి అలా వాకింగ్ చేయండి. సన్నిహితులతో కలిసి అలా వాకింగ్ చేయడం ద్వారా మనసుకు ఆహ్లాదం కలగడంతో పాటు శరీర కండరాలు ఫ్లెక్సీగా తయారవుతాయి. ఇదిగో ఈ క్రింద నిపుణురాలు చూపించినవిధంగా ప్రాక్టీస్ చేస్తే పొట్ట పెరగకుండా నాజూగ్గా వుంటారు.