Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రైమ్ వీడియోలు చూసి తండ్రిని చంపిన మైనర్ బాలుడు, ఎందుకంటే?

Advertiesment
minor boy
, శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:21 IST)
ఉత్తరప్రదేశ్ మధురలో ఓ దారుణం చోటుచేసుకున్నది. ఓ మైనర్ బాలుడు కన్నతండ్రినే హత్య చేసి ఆధారాలు లేకుండా చేశాడు. ఈ హత్యా ప్రయత్నం కోసం దాదాపు వంద సార్లు క్రైమ్ వీడియోలను చూసాడు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తన తండ్రి మనోజ్ మిశ్రా (42) తరుచూ తన సోదరిని కొట్టడం చూసి ఉద్వేగం చెందాడు. దీంతో తన తండ్రిని ఎలాగైనా అంతమొందించాలనే పథకం పన్నాడు.
 
ఇందుకు తన తల్లి సహకరించింది. ఈ నేపథ్యంలో ఆధారాలు లేకుండా ఎలా హత్య చేయడమని ఆలోచించాడు. దీనిలో భాగంగా క్రైమ్ వీడియో పెట్రోల్ టీవీ కార్యక్రమాన్ని చూడసాగాడు. ఓరోజు తండ్రిని ఇనుపరాడ్డుతో తలపై మోదాడు. ఆపై తలకు ఓ పెద్ద వస్త్రం చుట్టి గొంతు పిసికి చంపాడు. ఆ వస్త్రం ముఖాన్ని మెదడును కప్పివేయడంతో బాలుడి వేలిముద్ర తండ్రి శరీరంపై పడలేదు. ఆ తర్వాత బాడీని ప్రక్కనున్న ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి శరీరంపై పెట్రోలు, టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ పోసి కాల్చేశాడు.
 
మనోజ్ మిశ్రా ఇస్కాన్ మందిరంలో నిధులు సేకరిస్తుండేవాడు. కొద్ది రోజులుగా మనోజ్ మిశ్రా ఆచూకీ తెలియక పోవడంతో తమ సహచరులు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానం చెందిన పోలీసులు మనోజ్ మిశ్రా కుమారుడిని తరచూ దర్యాప్తుకు పిలిచారు. ఏదో కారణాలు చెప్పడంతో అనుమానం పెరిగి అతని ఫోన్‌ను పరిశీలించారు. అందులో దాదాపు వంద క్రైమ్ వీడియోలు కనిపించడంతో తమదైన శైలిలో విచారించగా ఆ బాలుడే హత్య చేశాడని తేలింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 2 నుంచి స్కూల్స్ రీఓపెన్... షెడ్యూల్ ఇదే...