Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం రసం అసమాన్యం... దాని రసం తాగితే...

అల్లం రసంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అల్లం రసాన్ని రెండు స్పూన్లు వేడి నీటిలో కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ చేరుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరానికి కావల్సిన జిం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (21:08 IST)
అల్లం రసంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అల్లం రసాన్ని రెండు స్పూన్లు వేడి నీటిలో కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ చేరుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరానికి కావల్సిన జింక్, మెగ్నిషియం, పొటాషియంలు అల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గిస్తాయి. గ్యాస్, అసిడిటీ పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. టాక్సిన్లు తొలగిపోతాయి.
 
పరగడుపునే అల్లం రసం తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. గుండె సమస్యలు రావు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
 
శరీరంలో అధికంగా చేరే నీటిని తొలగిస్తుంది. పరగడుపునే అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటికి వెళ్లిపోతుంది. అలసట, నీరసం తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, ఫ్లూ తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్లంలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments