Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్షోజ కేన్సర్ రోగుల కోసం క్యు యువర్ హెల్త్ ఇండియా 'షీలా జి' వాయిస్ ఎఐ పర్సనల్ హెల్త్ అసిస్టెంట్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (22:24 IST)
క్యు యువర్ ‪హెల్త్ సొల్యూషన్ ఇండియా వారు, వాయిస్ ఆధారిత కృత్రిమ మేథ(ఎఐ)తో పనిచేసే వ్యక్తిగత ఆరోగ్య సహాయకారిని ఆంగ్ల, హిందీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం, ఉర్దూ, బెంగాలి, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో ప్రవేశపెట్టేరు. ప్రస్తుతం, షీలా జి, వక్షోజ కేన్సర్- కీమోథెరపీ రోగులకి అందుబాటులో వుంటుంది. ఇంట్లో వుండే గ్లూకోమీటర్, బ్లడ్ ప్రెజర్ మోనికర్, పల్స్ ఆక్సిమీటర్, వెయింగ్ స్కేల్, థర్మామీటర్ వంటి ఆరోగ్య సాధనాల నుంచి ఈ షీలా జి, రోగుల తాలూకు కీలక పరామితుల సమాచారాన్ని వాయిస్, టెక్ట్స్, ఐఒటి సాధనాలని ఉపయోగించి దూరం నుంచే సేకరించి రికార్డు చేస్తుంది.
 
దీని ఎఐ నమూనా రోగుల తాలూకు డిజిటల్ సంతకాలని గుర్తించి, క్లినికల్ థెరపీలకి ముందు, తరవాత స్థితులు, చేయాల్సినవి, చేయకూడనివి, గుర్తుచేయడాలు, అపాయింట్మెంట్లతోసహా వ్యాధి స్థితిగతుల్ని నిర్వహించుకోడానికి వారికి సాయపడుతుంది. షీలా జీ ఇప్పుడు 'మై ఫ్యామిలీ హెల్త్ బుక్' ఆప్ అయిన - "మైఎఫ్‪హెచ్‪బి" ద్వారా ఆండ్రాయిడ్, ఐఒఎస్ స్టోర్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది.
 
భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ''సమాచారం పంచుకోడం ద్వారా రోగుల సంరక్షణ' అనేదాన్ని వైద్యులు, ఆస్పత్రులు, సంరక్షణ అందిస్తున్నవారు, కుటుంబ సభ్యుల మధ్య - విశ్వాసనీయమైన, సురక్షితమైన, భద్రమైన, అనుగుణ్యమైన పర్యావరణంలో అందించడం ద్వారా రోగి తాలూకు సంరక్షణ నాణ్యతని మెరుగుపరచడం జరుగుతోంది. ఎఫ్‪హెచ్‪బి ఆప్ లు (రోగుల కోసం మైఎఫ్‪హెచ్‪బి, వైద్యుల కోసం గోఎఫ్‪హెచ్‪బి), హెచ్ఐపిఎఎ, హై-ట్రస్ట్, ఎఫ్ఐఎస్ఎంఎ మోడరేట్ కంప్లయింట్ లని యుఎస్ఎలో 8,00,000 ప్రొవైడర్ల, 6000 ఆస్పత్రులకి మద్దతునిస్తున్న అనుభవజ్ఞులైన బృందం అభివృద్ధిజేసింది.   
 
క్యుయువర్ హెల్త్ పైలట్ అధ్యయనాలు, పరిశోధనకోసం, డా. రాయ్ సిబిసిసి కేన్సర్ సెంటర్ (చెన్నై), సంజీవని సిబిసిసి యుఎస్ఎ కేన్సర్ హాస్పిటల్ (రాయ్‪పూర్), ఆంకాలజీ ఇండియా (బెంగుళూరు), కావేరీ హెల్త్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (మైసూర్)లతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ షీలా జి ద్వారా ఆస్పత్రులు, క్లినిక్‌లు తమ రోగులకి తగిన విధంగా ఆరోగ్య సంరక్షణని రూపుదిద్దడానికి, రోగులు వారి ఇళ్ళలోనే సౌకర్యంగా వుంటుండగా వారికి సమర్థవంతంగా, అనుగుణ్యంగా సేవలు అందేలా చూడ్డానికి వీలుకలుగుతుంది.
 
క్యు యువర్ హెల్త్‌కి మాతృ సంస్థ అయిన వెంటెక్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు, సిఇఒ అయిన శ్రీ రవి కుందూరు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, "క్యుయువర్ హెల్త్ కథ మన జీవితాల్లో చాలా మందికి వ్యక్తిగతమైనది. 'సేవింగ్ లైఫ్, సూపర్ ప్రొయాక్టివ్' అనే ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న తొలి ప్రొవైడర్ మేమే. అన్నిరకాల, వయసుల రోగులు వారికి సంరక్షణ అందిస్తున్నవారు, వైద్యులు, ఆస్పత్రులతో సురక్షితంగా, భద్రంగా, అనుగుణ్యమైన యాక్సెస్ ఏర్పరుచుకునేలా మేం సేవలు అందిస్తాం. వ్యక్తిగతీకరించిన, ఆన్-లైన్, ఇన్ పర్సన్ సంరక్షణ పొందడానికి రోగులకి, వారి కుటుంబాలకి సురక్షితమైన, నమ్మకమైన ఐచ్ఛికంగా వుండాలన్నదే మా లక్ష్యం" అన్నారు.
 
క్యుయువర్ హెల్త్ సొల్యూషన్స్, విపి అయిన శ్రీ రాజరాజన్ మాట్లాడుతూ, "రోగులకి  వారి అనారోగ్యం గురించి, చికిత్స గురించి వుండే సందేహాలకి సమాధానాలు అందించడం ద్వారా వారి చికిత్సని, షీలా జి విప్లవీకరించి, అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. మేం ఆంకాలజీ  సంరక్షణతో ప్రారంభిస్తున్నాం, రాబోయే కొన్ని నెల్లలో ఇతర దీర్ఘకాల స్థుతులు, అవకలనాలని కూడా ఇందులో చేరుస్తాం. అనుకూల ఆరోగ్య ఫలితాలకోసం, రోగులకి నాణ్యమైన సంరక్షణ అందిస్తున్నవారితో, వైద్యులతో, ఆస్పత్రులతో రోగుల ఎంగేజింమెంట్ వంటివి అందించడానికి మా ఎఐ ఎంతో ఉపకరిస్తుతంది" అన్నారు.
 
2020 డిసెంబర్ 11, శుక్రవారంనాడు, క్యుయువర్ హెల్త్ వారు "ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ టెలిమెడిసిన్ - ఎ 360 డిగ్రీ రివ్యూ" అనే వెబినార్ నిర్వహించారు, ఇందులో భారతదేశవ్యాప్తంగా చాలామంది పాల్గొన్నారు. గౌరవనీయ అతిథులైన డా. అలెక్స్ థామస్, అధ్యక్షులు - అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా, డా. ఉమా నంబియార్, కో-ఫౌండర్ & ఛైర్ పర్సన్, డిజిటల్ హెల్త్ ఇండియా ఆసోసియేట్స్ (డిహెచ్ఐఎ), డా. మూర్తీ రెమిల్లా, హానరరీ సెక్రటరీ ఆఫ్ టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ప్రొ. రిక్ మమ్మొనె - ప్రపంచ ప్రసిద్ధ ఎఐ నిపుణులు, రుట్గెర్స్ యూనివర్శిటీ, యుఎస్ఎ, ఫ్యామిలీ హెల్త్ బుక్ స్యూట్ తాలూకు సాఫ్ట్ లాంచ్‌లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments