Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్ 19 చికిత్స కోసం ఫావిపిరావిర్‌

Advertiesment
తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్ 19 చికిత్స కోసం ఫావిపిరావిర్‌
, సోమవారం, 23 నవంబరు 2020 (22:23 IST)
నోటి ద్వారా తీసుకునే యాంటీ వైరల్‌ ఔషదం ఫావిపిరావిర్‌. ఇది వైరస్‌ జీవిత చక్రంలో ప్రతిరూపణ దశను నిరోధిస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్ 19 కలిగిన రోగులలో వైద్య పరంగా చికిత్సలో మెరుగైన ఫలితాలను ఇది అందిస్తుంది. ఈ అంశాలను ర్యాండమైజ్డ్‌, నియంత్రిత ఫేజ్‌ 3 క్లీనికల్‌ అధ్యయనంలో గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ కనుగొనడంతో పాటుగా ఈ ఫలితాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజస్‌ (ఐజెఐడీ)లో ప్రచురించారు. అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన, పీర్‌ సమీక్ష కలిగిన, పబ్మెడ్‌ ఇండెక్స్‌డ్‌, ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్‌ ఐజెఐడీ. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌, యుఎస్‌ఏ దీనిని ప్రతినెలా ప్రచురిస్తుంది. ఈ ప్రచురితమైన ఫలితాలను రాబోయే వారాలలో జర్నల్‌ యొక్క ప్రింట్‌ ఎడిషన్‌లో సైతం చూడవచ్చు.
 
ఈ అధ్యయనాన్ని జర్నల్‌లో ‘ఎఫికసీ అండ్‌ సేఫ్టీ ఆఫ్‌ ఫావిరాపిర్‌, యాన్‌ ఓరల్‌ ఆర్‌ఎన్‌ఏ- డిపెండెంట్‌ ఆర్‌ఎన్‌ఏ పాలిమరాస్‌ ఇన్హిబిటర్‌, ఇన్‌ మైల్డ్‌ టు మోడరేట్‌ కోవిడ్-19: ఏ ర్యాండమైజ్డ్‌, కాంపిటీటీవ్‌, ఓపెన్‌ లేబుల్‌, మల్టీ సెంటర్‌, ఫేజ్‌ 3 క్లీనికల్‌ ట్రయల్‌’ శీర్షికన ప్రచురించారు. దీని రచనను డాక్టర్‌ జరీర్‌.ఎఫ్‌.ఉడ్వాదియా మరియు ఇతర సహ రచయితలు  చేశారు.
 
ఫాబీఫ్లూ బ్రాండ్‌ పేరిట యాంటీ వైరల్‌ డ్రగ్‌ ఫావిపిరావిర్‌ మూడవ దశ అధ్యయనాన్ని 150 మంది రోగులలో ర్యాండమైజ్డ్‌, ఓపెన్‌ లేబుల్‌, మల్టీ సెంటర్‌, ఫేజ్‌ –3 అధ్యయనంగా చేశారు. ఈ అధ్యయనాన్ని ఫావిపిరావిర్‌ ప్లస్‌ యొక్క భద్రత, సమర్థతను పరీక్షించేందుకు ఫావిపిరావిర్‌ ప్లస్‌ ప్రామాణిక సంరక్షణ తో పాటుగా కేవలం ప్రామాణిక సంరక్షణతో కూడిన చికిత్సను సరిపోల్చి పరీక్షించారు.
 
ఫావిపిరావిర్‌ బహుళ ప్రయోజనాలను అందిస్తుందని తేలింది. ఇది వేగవంతంగా వైద్య చికిత్సను అందిస్తుంది మరియు గణనీయంగా ఆక్సిజన్‌ థెరఫీ మద్దతును సైతం ఆలస్యం చేస్తుంది. అదనంగా, తేలికపాటి లక్షణాలు కలిగిన కోవిడ్‌–19 రోగులను ఫావిపిరావిర్‌ తీసుకోని రోగులతో పోలిస్తే ముందుగానే డిశ్చార్జ్‌ చేశారు. నియంత్రిత గ్రూప్‌తో పోలిస్తే 2.5 రోజులకు క్లీనికల్‌ క్యూర్‌ తగ్గింది.
 
డాక్టర్‌ జరీర్‌. ఎఫ్‌. ఉద్వాడియా, ఎండీ, ఎఫ్‌ఆర్‌సీపీ, ఎఫ్‌సీసీపీ, బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌, ముంబై మాట్లాడుతూ, ‘‘ కోవిడ్‌ 19 చికిత్సలో ఉపయోగించే ప్రతి నూతన ఔషదం యొక్క సమర్ధతకు  క్లీనికల్‌ ట్రయల్‌ యొక్క నిరూపణ అవసరం. గ్లెన్‌మార్క్‌ ఇప్పుడు ఫావిపిరావిర్‌తో దానిని చేసింది. దాదాపు 150 మంది రోగులపై చక్కగా డిజైన్‌ చేసి చేసిన ఈ ట్రయల్‌లో ఫావిపిరావిర్‌ గణనీయంగా క్లీనికల్‌ క్యూర్‌ సమయ తగ్గేందుకు తోడ్పడింది. దీని ఆధారంగా, నేను తేలికపాటినుంచి మోస్టరు లక్షణాలు కలిగిన కోవిడ్‌ 19 రోగులలో  యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వినియోగించాలని భావించాను. ఇదే తరహా ట్రయల్స్‌ను బోస్టన్‌ మరియు స్టాన్‌ఫోర్డ్‌లో సైతం చేశారు. ఆ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’అని అన్నారు.
 
శ్రీ రాబర్ట్‌ క్రాకార్ట్‌, చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌ 19ను తొలుత గుర్తించిన నాటి నుంచి మేము ఆధారపడతగిన, సురక్షితమైన మరియు ప్రభావవంతమైన చికిత్స అవకాశాలను రోగులకు సమయానికి అందించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. మా ట్రయల్‌ ఫలితాలు ఇప్పుడు అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన వైద్య జర్నల్‌లో ప్రచురితం కావడం ప్రోత్సాహకరంగా ఉంది..’’ అని అన్నారు.
 
గ్లెన్‌మార్క్‌ క్లీనికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా రోగులు ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్లు 3600 ఎంజీ(1800ఎంజీబిడ్‌) (మొదటి రోజు) + 1600ఎంజీ(800ఎంజీబిడ్‌)(రెండవ రోజు లేదా తరువాత) గరిష్టంగా 14 రోజులు అందిస్తారు. దీనితో పాటుగా ప్రామాణిక వైద్య సంరక్షణ సైతం అందిస్తారు. ‘‘గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ చేసిన ఈ అధ్యయనం, అంతర్జాతీయంగా కోవిడ్ 19 కేసులు గణనీయంగా పెరుగుతున్న వేళ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఔషదాలను అందించాలనే గ్లెన్‌మార్క్‌ యొక్క నిబద్ధతను వెల్లడించడంతో పాటుగా వారి జీవన నాణ్యతపైసానుకూల ప్రభావం సైతం చూపుతుంది’’ అని డాక్టర్‌ మోనికా టాండన్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌– క్లీనికల్‌ డెవలప్‌మెంట్‌, గ్లోబల్‌ స్పెషాలిటీ/బ్రాండెడ్‌ పోర్ట్‌ఫోలియో-గ్లెన్‌మార్క్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? (video)