Webdunia - Bharat's app for daily news and videos

Install App

Moong Dal- పెసలు ప్రతిరోజూ తినవచ్చా? (Video)

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (20:01 IST)
పెసలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డయాబెటిస్‌కు ఆరోగ్యకరమైన ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువును నియంత్రించుకోవాలనుకునేవారికి పెసలు మంచి ఆహారం. వీటిలో బి విటమిన్ పుష్కలంగా వుంటుంది.
 
సులభంగా జీర్ణమయ్యే విధంగా రాత్రిపూట కొద్దిగా పెసలు తీసుకోవచ్చు. ఉడికించిన పెసల్లో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ శరీరో రోగనిరోధకశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. అంతేకాకుండా వీటిలోని విటమిన్స్ హోర్మోన్లను ప్రేరేపించడంలో, పిల్లల పెరుగుదలకు తోడ్పడుతాయి. వయస్సు పెరిగిపోతుందని బాధపడకుండా రోజువారి ఆహారంలో పెసల్ని క్రమంతప్పకుండా తీసుకుంటే వారి అసలు వయస్సు కన్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు. ఈ పెసల్లోని కాపర్ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.
 
హైబీపీ రోగులకు పెసలు చాలా మంచివి. వీటిని ఉడికించే ముందుగా వాటిలో కాస్త ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా ఉడికిన వాటిని రోజూ సేవిస్తే హైబీపీ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెసల్లోని ఐరన్‌ శరీర అవయవాలకు కావలసిన ఆక్సిజన్ సమృద్ధిగా అందిస్తుంది. దీని ఫలితంగా జ్ఞాపకశక్తి వంటి లోపాలు తొలగిపోతాయి. 
 
పెసల్లో క్యాలరీలు చాలా తక్కువ. వీటిల్లోని ఫైబర్ పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీని ఫలితంగా ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పెసల్లోని క్యాల్షియం ఎముకల బలానికి మంచిగా దోహదపడుతాయి. పెసలు రోజూ తగు మోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్య వుండదు. అధిక మోతాదు ఏదైనా అనర్థాన్ని కలిగిస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments