దేశీయంగా వృద్ధి చెందిన ఫార్మా అగ్రగామి సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్ నేడు తమ ఫావిపిరావిర్ బ్రాండ్ల యొక్క శక్తివంతమైన రకాలు- పిఫ్లూ మరియు ఫావెంజాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు కోవిడ్-19 కేసులకు చికిత్సనందించేందుకు వీటిని వినియోగించవచ్చు. ప్రిస్ర్కిప్షన్ ఉన్న రోగులకు మాత్రమే వినియోగించే ఈ ఔషధాలు దేశవ్యాప్తంగా అన్ని వాణిజ్య మెడికల్ ఔట్‌లెట్లు, ఆస్పత్రిలలోని ఫార్మసీలలో నవంబర్ 01, 2020వ తేదీ నుంచి లభ్యమవుతాయి.
ఈ ఔషధాల యొక్క 800 ఎంజీ వెర్షన్స్‌తో రోగులు తీసుకునే మాత్రల సంఖ్య 75% వరకూ తగ్గుతుంది. ప్రస్తుతం రోగులు తమ చికిత్స మొదటి రోజు 18 మాత్రలను తీసుకుంటే అనంతరం 13 రోజులు పాటు 8 మాత్రలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ అభివృద్ధి గురించి ఎఫ్‌డీసీ లిమిటెడ్ నుంచి శ్రీ మయాంక్ టిక్కా మాట్లాడుతూ, ఆగస్టులో పిఫ్లూ మరియు ఫావెంజాలను విడుదల చేసిన తరువాత, మేము మోతాదు ఫ్రీక్వెన్సీని తగ్గించడంపై పనిచేయాలని, అలాగే ఖర్చునూ తగ్గించాలని నిర్ణయించాం. ఈ ఫలితంగానే మేము ఈ నూతన వేరియంట్‌లను విడుదల చేయగలిగాం.
పిఫ్లూ-800 మరియు ఫావెంజా 800లు రోగులకు చికిత్స ఖర్చును 30% తగ్గించడంతో పాటుగా అదే సమయంలో చికిత్స యొక్క సామర్థ్యంనూ వృద్ధి చేస్తుంది. ఇది జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడంతో పాటుగా ఫ్యామిలీ ఫిజీషియన్ల చేత కూడా ఈ చికిత్సను పొందడం వల్ల హోమ్ క్వారంటైన్‌లో ఉన్న రోగులకు ఖర్చును సైతం తగ్గిస్తుంది అని అన్నారు.
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతించిన ఫావిపిరావిర్, విస్తృతశ్రేణిలోని యాంటీ వైరల్ ఏజెంట్ మరియు ఇన్‌ఫ్లూయెంజా, సార్స్‌కోవ్-2 వైరస్‌ల యొక్క ఆర్‌ఎన్‌ఏ పాలిమరేస్‌ను అడ్డుకుంటుంది మరియు వైరల్ ప్రతిరూపకల్పనను నిరోధిస్తుంది. కోవిడ్-19 తీవ్రం కావడం మరియు క్లిష్టతరంగా మారడాన్ని ఫావెంజా మరియు పిఫ్లూ ఔషదాలు 10వ రోజు నాటికి 92.5% తగ్గించడంతో పాటుగా 5వ రోజు నాటికి 62.5% తగ్గిస్తాయి. అంతేకాదు 15వ రోజు నాటికి రోగి యొక్క ఛాతీ సీటీ స్కోర్ 90% వరకూ వృద్ధి చెందుతుంది.
ఈ ఓరల్ యాంటీ వైరల్ ఔషధం వైరల్ రెప్లికేషన్ సైకిల్‌ను తగ్గించడంతో పాటుగా తేలికపాటి నుంచి మోస్తరు లక్షణాలు కలిగిన కోవిడ్-19 రోగులు వేగంగా కోలుకునేందుకు సహాయపడుతుంది. ఈ తరహా ఆవిష్కరణలతో కోవిడ్-19తో పోరాటంలో భారతదేశం తరపున ఎఫ్‌డీసీ తన పోరాటం కొనసాగిస్తుంది.