Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుముక వ్యాధితో కాళ్లలో కదలికలు కోల్పోయిన 46 సంవత్సరాల మహిళకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవంతంగా చికిత్స

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (17:40 IST)
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ వారు అత్యంత అరుదైన వెన్నుముక వ్యాధితో బాధపడుతున్న కృష్ణాజిల్లాకు చెందిన 46 సంవత్సరాల మహిళ జి.నాగలక్ష్మికి  విజయవంతంగా చికిత్సనందించారు. ఆమె ఇడియోపతిక్‌ స్పైనల్‌ కార్డ్‌ హెర్నియేషన్‌‌తో బాధపడుతున్నారు. తను గత నాలుగు సంవత్సరాలుగా రెండు కాళ్లలోనూ పట్టుకోల్పోయి, నడుము మధ్య భాగంతో పాటుగా దిగువ భాగంలో విపరీతమైన నొప్పితో సతమతవుతున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె ఎడమ పాదంలో అసలు పట్టులేదని, కుడికాలులో సూదులతో గుచ్చినట్లుగా లక్షణాలు కనిపిస్తున్నాయన్నట్లుగా చెబుతూ మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడలో కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ గుండమనేనిని సంప్రదించారు.

 
కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సీహెచ్‌ మురళి మాట్లాడుతూ, ‘‘ఇడియోపతిక్‌ స్పైనల్‌ కార్డ్‌ హెర్నియేషన్‌ అనేది అత్యంత అరుదైన వ్యాధి. డ్యూరలో లోపం కారణంగా స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముకలో నరం)లో బయటకు జరిగినప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం తెలియదు. అత్యంత అరుదుగా రావడంతో పాటుగా ఈ వ్యాధికి కారణం కూడా పెద్దగా తెలవక పోవడం వల్ల వ్యాధి నిర్ధారణ కూడా కష్టం. ఈ 46 సంవత్సరాల మహిళ తన నడుము మధ్యభాగం నుంచి దిగువకు విపరీతమైన నొప్పి వస్తుందంటూ వచ్చింది. దీనితో పాటుగా ఆమె నడుము క్రింద నుంచి అవయవాలు కూడా బలహీనమైనట్లుగా చెప్పారు. ఆమె తన రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడం కష్టంగా మారడంతో ఆమె నెమ్మదిగా కుర్చీకి అంకితమైపోయారు’’ అని అన్నారు.

 
కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం సతీష్‌ బాబు మాట్లాడుతూ, ‘‘ అత్యంత అరుదైన వ్యాధి. మొదట థొరాసిక్‌ స్పైనల్‌ కార్డ్‌పై ప్రభావం చూపుతుంది. ఆ కారణం చేత ఆమె వెన్నుముకకు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించాము. ఆ రిపోర్ట్‌లో ఆమె స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముకలో నరం) డీ2 నుంచి డీ5 వెర్టెబ్రా (నడుము మధ్య భాగం) డ్యూరామ్యాటర్‌ (మెదడు మరియు వెన్నుముకను కవర్‌చేస్తుంది)లో లోపం కారణంగా బయటకు వెళ్లింది మరియు స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముకలో నరం)కు  ప్రస్తుతం జరుగుతున్న నష్టానికి సూచికగా సన్నబడింది. స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముకలో నరం) కెనాల్‌ వెలుపలకు పొడుచుకు వచ్చినందున చివరకు అది  దెబ్బతినే ప్రమాదం  ఉంది. ఒకవేళ ఆమెకు మెరుగైన చికిత్సనందించకపోతే ఆమె రెండు కాళ్లూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది’’అని అన్నారు.

 
కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ గుండమనేని ఈ రోగి చికిత్స గురించి మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయంగా ఇప్పటి వరకూ ఇలాంటి వ్యాధులు 190 నుంచి 200 కేసులు మాత్రమే ప్రచురితమయ్యాయి. ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి తగిన శస్త్ర చికిత్స పద్ధతులేవీ నిర్వచించబడలేదు. ఆమె ఎంఆర్‌ఐ స్కాన్‌లో కనిపించిన లక్షణాల ఆధారంగా ఆమెకు చికిత్స ప్రణాళిక చేయడంతో పాటుగా ఆమె స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముకలో నరం)ను సాధారణ స్ధితికి తీసుకురావడం లక్ష్యం. తగిన పరీక్షలను చేసిన అనంతరం మేము ఆమె స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముకలో నరం)సరిచేసే చికిత్సను చేశాము మరియు హెర్నియేటెడ్‌ స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముకలో నరం)ను తిరిగి యథాస్ధానములోకి తీసుకువచ్చాము. డ్యూరల్‌ డిఫెక్ట్‌కూ  తగిన చికిత్స చేశాము. శాండ్‌విచ్‌ టెక్నిక్‌‌తో వెన్నుముక నరానికి చికిత్సనందించడం వల్ల మరలా ఆ లోపం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. శస్త్రచికిత్స తరువాత ఆమె రీహాబిలిటేషన్‌, ఫిజియోథెరఫీ చేయించుకుని తన కదలికలను తిరిగి పొందగలిగారు. నేడు, ఆమె ఎలాంటి మద్దతు లేకుండా నడవగలగడంతో పాటుగా రోజువారీ పనులను సొంతంగా చేసుకోగలుగుతున్నారు. ఆమె ఒకవేళ ఆలస్యం చేసి ఉంటే ఆమె రెండు కాళ్లూ నెమ్మదిగా చచ్చుబడిపోయేవి’’ అని అన్నారు.

 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ- హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘ప్రతి ఒక్కరికీ అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించడానికి మేము ప్రయత్నిస్తుంటాము. అత్యాధునిక క్లీనికల్‌ నైపుణ్యం, అనుభవంతో ప్రతి రోగినీ పరిక్షించి చికిత్సనందించాల్సి ఉంటుంది. మా సమగ్రమైన న్యూరో మరియు స్పైన్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఈ ప్రాంతంలో వైద్య సేవలను మరింతగా శక్తివంతం చేస్తోంది. రోగులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యకు తగిన చికిత్స పొందవచ్చు. ఇక్కడ డాక్టర్లు పూర్తి అంకితభావం, అత్యున్నత నైపుణ్యంతో రోగులకు చికిత్సనందంచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ గుండమనేని నేతృత్వంలోని మా వైద్య బృందాన్ని అభినందిస్తున్నాను. ఈ రోగికి మెరుగైన చికిత్స ఫలితాలనందిస్తూ వారు చికిత్స చేశారు.. ఈ హాస్పిటల్‌లో అత్యాధునిక న్యూరో మరియు స్పైన్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఉంది. ఇది న్యూరో మరియు స్నైన్‌ సర్జరీల కోసం విప్లవాత్మక సాంకేతికతలను వినియోగించుకుంటుంది. అత్యంత అరుదైన వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ  చిన్న పిల్లలతో పాటుగా పెద్ద వయసు రోగులకు ఇక్కడ  స్పెషలైజ్డ్‌ డాక్టర్లు మెరుగైన చికిత్సనందించగలరు’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments