Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తణుకు, పరిసర ప్రాంత వాసులకు అత్యుత్తమ వైద్య సేవలకై మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఓపీడీ క్లీనిక్‌ ప్రారంభం

Advertiesment
తణుకు, పరిసర ప్రాంత వాసులకు అత్యుత్తమ వైద్య సేవలకై మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఓపీడీ క్లీనిక్‌ ప్రారంభం
, బుధవారం, 13 ఏప్రియల్ 2022 (23:11 IST)
తణుకు, చుట్టు పక్కల ప్రాంత వాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా  ఓపీడీ క్లీనిక్‌ను మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ ప్రారంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో  ప్రారంభించిన ఈ క్లీనిక్‌ ద్వారా ఆ ప్రాంత వాసులకు మెరుగైన జీవితాన్ని అందించడం లక్ష్యంగా చేసుకుంది మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ.

 
ఈ క్లీనిక్‌లో న్యూరో సర్జరీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధిత సేవలను ప్రతి నెల మొదటి, మూడవ శుక్రవారం; సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ సేవలను ప్రతినెల రెండవ శుక్రవారం; రెనెల్‌- క్యాన్సర్‌ సంబంధిత సేవలను ప్రతి నెల నాల్గవ శుక్రవారం అందించనున్నారు. అతి సులభమైన రెండంచెల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో ఈ కార్యక్రమం 100% గోప్యతకు భరోసా అందిస్తుంది.

 
ఈ క్లీనిక్‌ ప్రారంభించిన సందర్భంగా మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ-హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి  మాట్లాడుతూ, ‘‘ పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో సామాన్య ప్రజలకు  ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా పలు రకాల ఆరోగ్య సమస్యలకు సూపర్‌ స్పెషాలిటీ క్లీనిక్‌ సేవలను అందించడం లక్ష్యంగా దీనిని ప్రారంభించాము. 

 
పలు సూపర్‌ స్పెషాలిటీలలో సుశిక్షితులైన, నిపుణులైన డాక్టర్లను కలిగిన క్లీనిక్‌, తగిన చికిత్స, సేవలను రోగులకు అందించనుంది. సామాన్యులకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలను తీసుకురావడం ద్వారా ముందుగానే పలు వ్యాధులను కనుగొనడం, మెరుగైన చికిత్సనందించడం వీలవుతుంది. ఇక్కడ రోగులు స్వేచ్ఛగా తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు వెల్లడించవచ్చు. తగిన వైద్య సలహాలు, చికిత్సనందించేందుకు ఇక్కడ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అన్నారు.

 
నరేంద్ర డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, బాయ్స్‌ హైస్కూల్‌ గేట్‌ ఎదురుగా, వల్లూరి వారి వీధి, ఆర్‌పీ రోడ్‌, తణుకు, పశ్చిమగోదావరి వద్ద ఏప్రిల్‌ 14, 2022న హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి ఈ ఓపీడీ క్లీనిక్‌ ప్రారంభించారు. ఈ క్లీనిక్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్సాహపూరితమైన ఆఫర్లతో తమ మెగా వార్షికోత్సవ విక్రయాలను ప్రకటించిన ఓరా