Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతీయ భద్రతా మాస వేడుకల ముగింపు సూచికగా వీడ్కోలు సభ

జాతీయ భద్రతా మాస వేడుకల ముగింపు సూచికగా వీడ్కోలు సభ
, ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (18:55 IST)
భద్రత నేపథ్యంతో జాతీయ భద్రతా దినోత్సవంలో భాగంగా నెల రోజుల పాటు పలు కార్యక్రమాలను జీఓసీఎల్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లోని పెసో ఉన్నతాధికారులు ఈ కార్యక్రమ ముగింపు వేడుకలలో పాల్గొనడంతో పాటుగా సురక్షిత ప్రక్రియలను అనుసరించాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు.
 
బాధ్యతాయుతమైన ప్రాంగణాలలో భద్రత అత్యంత కీలకంగా ఉంటుంది. అందువల్ల తమ ఉద్యోగుల భద్రతకు భరోసానందిస్తూ, ఆ భద్రతను మెరుగుపరిచే ఉత్తమ పద్ధతులకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం అత్యంత కీలకం. భద్రతే ముందు అనే ఆలోచనా ధోరణి పెంపొందించాలంటే ముందుగా ఉద్యోగులకు ఆ అంశాల పట్ల తగిన శిక్షణ అందించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది.
 
తమ జాతీయ భద్రతా దినోత్సవంలో భాగంగా నెల రోజుల పాటు నిర్వహించిన వేడుకలో జీఓసీఎల్‌ ఈ ప్రయత్నాలను పెద్ద ఎత్తున చేసింది. కూకట్‌పల్లిలోని జీఓసీఎల్‌ కార్పోరేషన్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ముగింపు వేడుకల ద్వారా ఈ కార్యక్రమాలను ముగించారు. ఈ కార్యక్రమంలో పెసో - హైదరాబాద్‌ జాయింట్‌ అఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కె.సుందరేశన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, జీఓసీఎల్‌ ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
‘భద్రతే ముందు ’అనే విధానంతో పనిచేయాల్సిన ఆవశ్యకత గురించి సుందరేశన్‌ మాట్లాడుతూ.. ‘‘భద్రత అనేది వ్యక్తిగతంగా మాత్రమేకాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. వ్యక్తులుగా మనం చేసే ప్రతి పనిలోనూ భద్రతపై స్పష్టమైన వైఖరిని అవలంభించడం ద్వారా మరింత అవగాహన కలిగిన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. ఈ దిశగా జీఓసీఎల్‌ చేస్తోన్న ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. ఈ సంస్థ నిర్వహించిన భద్రతా దినోత్సవ కార్యక్రమాలు సానుకూల ప్రభావాన్ని సృష్టించగలవని భావిస్తున్నాను’’ అని అన్నారు.
 
జీఓసీఎల్‌ సీఈఓ పంకజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘తాము నిర్వహిస్తోన్న ప్రతి కార్యక్రమంలోనూ భద్రతకు అమిత ప్రాధాన్యతను జీఓసీఎల్‌ అందిస్తుంది. గత నెల రోజులుగా మేము నిర్వహిస్తోన్న కార్యక్రమాలను మా సిబ్బంది నడుమ భద్రత పట్ల మరింత అవగాహన కల్పించే రీతిలో నిర్మించాము. ఈ దిశగా మా పరిశ్రమలో నూతన ప్రమాణాలను ఏర్పరచగలమని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుడింగ్ మింక్ పబ్ కేసుపై సీరియస్.. సీపీ అత్యవసర భేటీ