Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వాసకోశ వ్యాధుల పట్ల అవగాహన కల్పించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ

Image
, గురువారం, 21 ఏప్రియల్ 2022 (18:06 IST)
సామాన్య ప్రజల నడుమ శ్వాసకోశ వ్యాధుల పట్ల అవగాహనను మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ కల్పించింది. మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ అత్యాధునిక పరికాలతో కూడిన తమ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ యూనిట్‌ను  ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్స కోసం ప్రారంభించింది. ఈబస్‌ (ఎండోబ్రాంకియల్‌ అలా్ట్రసౌండ్‌) మరియు రిజిడ్‌ బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తులలో స్టెంటింగ్‌, థొరాకోస్కోపీ వంటివి ఇప్పుడు మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ వద్ద లభ్యమవుతాయి.

 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడలో అత్యంత అనుభవజ్ఞులైన పల్మనాలజిస్ట్‌లతో కూడిన బృందం ఉంది.  వీరు  ఉబ్బసం, శ్వాసకోశ ఇబ్బందులు, న్యుమోనియా, ధూమపాన సంబంధిత ఊపిరితిత్తుల ఇబ్బందులు బ్రోంకైటిస్‌, నిద్రలో వచ్చే శ్వాసకోశ ఇబ్బందులు, ఊపిరితిత్తులలో నీరు చేరుట, క్షయ (టి.బి), ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఐ.యల్‌.డి (ఐఔఈ) సహా  అన్ని రకాల ఊపిరితిత్తుల వ్యాధులకు సమగ్రమైన చికిత్సను అందించగలరు. కార్డియాలజీ, ఆంకాలజీ, ఓటోలారిన్జాలజీ మరియు నెఫ్రాలజీ వంటి ఇతర డిపార్ట్‌మెంట్‌ల సహకారంతో మల్టీ డిసిప్లీనరీ విధానాన్ని ఈ డిపార్ట్‌మెంట్‌ అనుసరిస్తోంది.

 
ఈ హాస్పిటల్‌లో అత్యాధునికమైన రెస్పిరేటరీ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఉంది మరియు అత్యాధునిక సాంకేతికతను ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ కోసం వినియోగిస్తుంది. ఇక్కడ ప్రత్యేక నైపుణ్యం కలిగిన డాక్టర్లు, చిన్నారులతో పాటుగా పెద్దలకు ఇంటర్వెన్షనల్‌ ప్రోసీజర్లు అయినటువంటి ఫ్లెక్సిబల్‌  బ్రాంకోస్కోపీ, థొరాకోస్కోపీ, రిజిడ్‌ బ్రాంకోస్కోపీ, లీనియర్‌ మరియు రేడియల్‌ ఈబఎస్‌, ఊపిరితిత్తులో స్టెంటింగ్‌ వంటివి చేస్తారు. రోగులకు నిర్ధారణ పరీక్షలను, చికత్సను అందించనున్నారు.

 
హాస్పిటల్‌లోని అత్యాధునిక పరికరాలను వినియోగించి, డాక్టర్లు అత్యంత అరుదైన  వ్యాధులను ముందుగానే గుర్తించి, ఖచ్చితమైన చికిత్స చేయించగలరు. మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడలో కన్సల్టెంట్‌- ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌గా సేవలనందిస్తోన్న డాక్టర్‌ గుత్తా లోకేష్‌ మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి ఊపిరితిత్తుల వ్యాధులకు  సంబంధించిన అవగాహన కార్యక్రమాలలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎన్నో ప్రాణాలను కాపాడటంలో ఈ కార్యక్రమాలు తోడ్పడనున్నాయి.

 
ఉదాహరణకు, 25 సంవత్సరాల వయసున్న ఓ పురుష రోగిని తీసుకుంటే, అతనికి రెండు నెలల క్రితం డెంగ్యూ-ఏఆర్‌డీఎస్‌ వచ్చిన చరిత్ర ఉంది. డెంగ్యూ నుంచి కోలుకున్న తరువాత ఆయన ఓ వారం పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అతనిని పరిశీలించిన అనంతరం శ్వాసకోశ నాళము ముడుచుకోవడం జరిగిందని కనుగొన్నాము. మేము అతనికి రిజిడ్‌ బ్రాంకోస్కోపీని చేయడంతో పాటుగా ఎలక్ట్రో సర్జరీ మరియు బెలూన్‌ బ్రాంకోప్లాస్టీ చేసిన అనంతరం సిలికాన్‌ ఎయిర్‌వే స్టెంటింగ్‌ చేశాము. స్టెంట్‌ మైగ్రేషన్‌ నివారించడానికి స్టిచ్‌తో ఎక్సటర్నల్‌ ఫిక్సేషన్‌ చేశాము. ఇప్పుడు ఆ రోగి ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా సాధారణ జీవితం గడుపుతున్నాడు..’’ అని అన్నారు.

 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడలో కన్సల్టెంట్‌- పల్మనాలజిస్ట్‌గా సేవలనందిస్తోన్న కన్సల్టెంట్‌గా సేవలనందిస్తోన్న డాక్టర్‌ ఉదయ్‌కిరణ్‌  మాట్లాడుతూ, ‘‘ రోడ్డు ప్రమాదంలో గాయపడిన 26 సంవత్సరాల రోగి ఐసీయులో చేరాడు. అతనికి పలు శస్త్రచికిత్సలు చేయడంతో పాటుగా మూడు వారాల పాటు ఐసీయులో ఉన్నాడు. అతనికి ఓ నెల తరువాత శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలిగింది. ఆయనను పరిశీలించిన తరువాత ఆయనకు శ్వాసనాళం మూసుకుపోయిందని గుర్తించాము. చికిత్సనందించడం కోసం బ్రాన్కోస్కోపీ  కావాల్సి ఉంది. ఈ రోగికి  రిజిడ్‌ బ్రాన్కోస్కోపీ , ఎలకో్ట్ర సర్జికల్‌ రిపేర్‌ మరియు బెలూన్‌ బ్రాంకోప్లాస్టీ చేసిన అనంతరం సిలికాన్‌ స్టెంటింగ్‌ను అనస్తీషియా తరువాత చేశారు. ఈ చికిత్స అనంతరం అతను కోలుకోవడంతో పాటుగా తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు..’’ అని అన్నారు.

 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘ఈ అవగాహన కార్యక్రమంలో భాగం కావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెస్పిరేటరీ మెడిసన్‌ మరియు ఇంటర్వెన్షల్‌ పల్మనాలజీ కేర్‌లో నివారణ మరియు మెరుగైన ప్రాప్యత పరంగా మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ సాధించిన విజయాలకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. మెరుగైన సేవలు అందుబాటులో ఉండటం వల్ల ఊపిరితిత్తుల వ్యాధుల రాక, పురోగతిని నివారించడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేప ఆకులతో ఆరోగ్యం...