Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెయినీ సీజన్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? (video)

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (21:35 IST)
వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల మన జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి నూనె ఎక్కువగా గల పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. ఇక తాజా ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్లు బాగా తీసుకుంటే రోగనిరోధకశక్తి పెంపొందుతుంది. పండ్లు కూడా మంచివే. ఇవి శక్తిని అందిస్తాయి.
 
యాపిల్‌, దానిమ్మ వంటి పండ్లు తినాలి. వీటిని శుభ్రంగా కడిగాకే తీసుకోవాలి. వానకాలంలో బార్లీ, ముడిబియ్యం, ఓట్స్‌ తినటమూ మంచిదే. పాల పదార్థాలు సూక్ష్మక్రిముల తాకిడికి ఎక్కువగా గురయ్యే అవకాశముంది. అందువల్ల పాలకు బదులు పెరుగు తినటం మేలు. బాదంపప్పు తినటమూ మంచిదే. వానకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల ఫంగల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల బెడదా ఎక్కువే.
 
మసాలాలు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి దురద, అలర్జీలకు దారితీస్తాయి. కాబట్టి చర్మ వ్యాధులు, అలర్జీలు గలవారు ఈ కాలంలో మసాలా పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. తేమ మూలంగా చర్మం జిడ్డుగా మారుతుంది కూడా. దీంతో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే అవకాశమూ ఉంది.
 
అందువల్ల ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి దాహం వేసినా వేయకపోయినా వానకాలంలో తగినంత నీరు తాగటం తప్పనిసరి. ఈ సమయంలో నీరు కలుషితమయ్యే అవకాశమూ ఎక్కువే కాబట్టి కాచి చల్లార్చిన నీరు తాగటం అన్నివిధాలా మంచిది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments