Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకుంటే?

వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకుంటే?
, శనివారం, 17 జులై 2021 (11:15 IST)
వర్షాకాలం రాగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఇంకా జ్వరం, దగ్గు, జలుబు, వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
 
వానా కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. ప్రధానంగా బయటి ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకుంటే పలు ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో బజ్జీలు, పకోడీలు వంటి ఆహార పదార్ధాలను తినడానికి ఎక్కవగా ఇష్టపడుతుంటారు. 
 
ముఖ్యంగా ఈ విధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకుంటే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అదేవిధంగా వర్షాకాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ విధంగా ఇన్ఫెక్షన్ సోకిన ఆకుకూరలను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
 
వర్షా కాలంలో హెర్బల్ టీ లేదా కషాయాలను తాగ‌డం ద్వారా మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుప‌డుతుంది. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.
 
ప్రతి సీజన్‌లో అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సీడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 
నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న ‘విటమిన్ సీ’ అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి. అంతేకాకుండా నిమ్మకాయతో రోగనిరోధక శక్తి కూడా అమితంగా పెరుగుతుంది.
 
వర్షాకాలంలో సలాడ్లు, ఐస్‌క్రీమ్‌లను తీసుకోకపోవడం మంచిదంటున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల నీటి ద్వారా చాలా రకాల ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది.
 
వర్షాకాలంలో చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారపదార్థాలను తీసుకోవడం మానేయాలి. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల చేపలు రొయ్యలను తీసుకోవడంతో ఆ ప్రభావం మనపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గబ్బిలాలు చీకట్లో చూడగలవా?