రక్తహీనత వున్నవారు నల్లనువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (14:38 IST)
రక్తహీనత తగ్గేందుకు 100 గ్రాముల నల్ల నువ్వులలో, 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఉసిరికాయంత తిని, ఆ తర్వాత 100 మిల్లీ లీటర్ల పాలు లేదా, గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
 
చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లం లేకుండా కేవలం 5 గ్రాముల నల్లనువ్వుల పొడిని 100 మిల్లీ లీటర్ల వేడి పాలలో కలిపి రాత్రిపూట త్రాగుతుండాలి.

కీళ్ల నొప్పులు వున్నవారు నువ్వుల చూర్ణం, సొంఠి చూర్ణం సమానంగా కలిపి ఉంచుకొని రెండు పూటలా పూటకు అర టీస్పూన్ చొప్పున తేనెతో కలిపి వాడాలి. చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు 100 మిల్లీ లీటర్ల పాలు లేదా నీళ్లతో కలిపి త్రాగాలి. 
 
నోటిపూత తగ్గేందుకు నువ్వుల చూర్ణం, పటికబెల్లం పొడి ఒక్కొక్కటి 50 గ్రా. చొప్పున తీసుకొని రెండింటిని కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రెండు పూటలా అరస్పూన్ పొడిని ఒక టీస్పూన్ వెన్నతో కలిపి సేవించడం వలన నోటిపూత తగ్గుతుంది.
 
సుఖనిద్ర కోసం నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజుకు ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

తర్వాతి కథనం
Show comments