సీజన్లతో సంబంధం లేకుండా దొరికే అరటి పండు వలన చాలా ఉపయోగాలున్నాయి. అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. మలబద్దకం ఎక్కువగా ఉన్నవారికి నెల రోజులు కచ్చితంగా తినిపిస్తే వారికి ఈ సమస్య ఉండదు.
అరటికాయల్లో ఫైబర్ శాతం ఎక్కువ. అందువల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. గుండె సమస్యలను అరటి నివారిస్తుంది. అరటిలో వుండే పొటాషియం, తక్కువ సోడియం కారణంగా అధిక రక్తపోటు నియంత్రిస్తుంది. అంతేకాదు రక్తహీనత రాకుండా కాపాడుతుంది. అరటి పండు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
కడుపులో మంట లేదా ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. కనుక ప్రతిరోజూ ఒక్క అరటి పండు అయినా తింటే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.