అరటి కాయను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అరటికాయను తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. అరటి కాయకు పేగులను శుద్ధీకరించడం, అందులోని కొవ్వు సెల్స్‌ను నశింపజేస్తుంది. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. అరటి కాయ రక్త కణాల్లోని గ్లూకోజ్‌ను పీల్చడాన్ని ఆపేస్తాయి. ఇన్సులిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అరటికాయలోని ఫైబర్ అజీర్తికి చెక్ పెడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇందులో వుండే ఇనుము, పిండిపదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటికాయ ఆకలిని నియంత్రిస్తుంది. ఇంకా అరటికాయతో పాటు మిరియాలు, జీలకర్ర చేర్చి వండితే ఎంతో మంచిది. అరటికాయను తీసుకుంటే కడుపులో మంట, నోటిలో నీరు చేరడం, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు.
డయాబెటిస్ పేషెంట్లు మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంలో అరటికాయను తీసుకోవడం మంచిది. అరటికాయ పైనున్న తొక్కను తొలగించి పచ్చడిలా నూరి అన్నంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. దీనిని తీసుకుంటే రక్తవృద్ధి, శారీరక బలం చేకూరుతుంది.
శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించి.. క్యాన్సర్ కణతులను ఏర్పడకుండా చేస్తుంది. అరటికాయలో విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా వున్నాయి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. అంతేగాకుండా మోకాళ్ల నొప్పిని నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.