సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 6 గంటల పాటు అధికారులతో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని అధికారులకు సూచించారు.
రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. తిరుగు ప్రయాణంలో యాదాద్రి కొండ దిగుతూ ఘాట్ రోడ్డులో కోతుల గుంపులను చూసి తన కాన్వాయ్ ఆపిన కెసిఆర్ కోతులకు అరటిపళ్లు పంచారు.