Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి మాల్ట్‌ని రోజుకు రెండుసార్లు పాలలో కలుపుకుని తాగితే..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (13:56 IST)
దృఢమైన శరీరం గల వారు రోగాలను ఎదుర్కొనగలరు. శరీరం దృఢంగా ఉండాలంటే రాగులని మన ఆహారంతో తీసుకోవాలి. వివిధ రోగాలకి రాగులు బాగా పనిచేస్తాయి. మొక్కగట్టిన ధ్యానం పిండిని రాగిమాల్ట్ అంటారు. రాగుల్ని బాగు చేసి నీళ్ళలో నానబెట్టి నాలుగు గంటల తరువాత గుడ్డలో వేసి మూటగట్టి పైన బరువు ఉంచండి.
 
రెండు మూడు రోజుల్లో చిన్న మొక్కలొస్తాయి. మొలకలొచ్చిన తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత దోరగా వేయించాలి. నూనె వెయ్యకుండా మామూలు మూకుడిలో వేయించి అలా వేగిన రాగుల్ని మర పట్టించాలి. ఆ పిండినే రాగిమాల్ట్ అంటారు. రాగి మాల్ట్‌ని రోజుకు రెండుసార్లు పాలలో గాని, మజ్జిగలో గాని కలుపుకుని తాగాలి.
 
కడుపులో మంటకి, వాంతులు, వికారానికి, మలబద్థకం నివారణకి రాగిమాల్ట్ మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల ఆ వ్యాధులు త్వరగా తగ్గుతాయి. మధుమేహం‌, బిపి తగ్గటానికి రాగిమాల్ట్ వాడవచ్చు. రాగిమాల్ట్ తరుచూ తాగటం వల్ల చలువ చేస్తుంది. రక్తదోషాలన్నింటికి చాలా మంచిది. బొల్లి, సోరియాసిస్‌ మరియు ఇతర చర్మవ్యాధులలో బాధపడేవారు, సుగంధ పాలతో రాగిమాల్ట్ కలుపుకుని తాగితే ఆయా వ్యాధులు త్వరగా తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

తర్వాతి కథనం
Show comments