పాల నదిని ఎక్కడైనా చూశారా..? చూడలేదంటే ఈ కథనం చదవాల్సిందే. యూకేలోని ఓ నదిలో పాలు ప్రవహించాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, వేల్స్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న దులైస్ నదిలో ఉన్నట్టుండి ఏప్రిల్ 14 నుంచి పాల ప్రవాహం మొదలైంది. ఈ ఘటనతో షాకైన గురైన స్థానికులు ఏమైందా అని ఆరాతీస్తే అసలు నిజం వెలుగుచూసింది.
దులైస్ నదికి సమీపంలో ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడి అందులోని 28 వేల లీటర్ల పాలు వరదలా పోటెత్తి నదిలోకి ప్రవహించాయి. దీంతో.. దులైస్ నది క్షీర ప్రవాహాన్ని తలపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పాలు ఎక్కువ కాలుష్యానికి కారణమవుతుందని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని ఎన్ఆర్డబ్ల్యూకి చెందిన అయోన్ విలియమ్స్ చెప్పారు. అలాగే నదిలోని చేపలు కూడా చనిపోయే ఆస్కారం నవుందని అయోన్ విలియమ్స్ వెల్లడించారు.