Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా.. ముఖేష్ ఉదారత

Advertiesment
మహారాష్ట్రకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా.. ముఖేష్ ఉదారత
, గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:09 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కరోనా కష్టకాలంలో తన ఉదారతను చాటుకున్నారు. మహారాష్ట్రలో కరోనా సునామీ కొనసాగుతోంది. దీంతో ఆస్పత్రులతో పాటు.. ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 
 
ఈ తరుణంలో తమ చమురుశుద్ధి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు నిర్ణయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ప్లాంటును రిలయన్స్ నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఉన్న తమ రిఫైనరీలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.
 
ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే రిలయన్స్ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు వస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆక్సిజన్ సరిపోక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కట్టడి కోసం మహా ప్రభుత్వం జనతా కర్ఫ్యూ కూడా విధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలాఖ్.. తలాఖ్…తలాఖ్.. ముస్లిం మహిళలకు గుడ్ న్యూస్..?!