Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో ఛత్రపతి శివాజీ వంశస్థుడి భిక్షాటన

ముంబైలో ఛత్రపతి శివాజీ వంశస్థుడి భిక్షాటన
, ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (14:05 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదతువున్నాయి. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శనివారం వ్యాఖ్యానించారు. 
 
వైరస్‌ను నియంత్రించేందుకు ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడం, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో లాక్డౌన్ విధించక తప్పేలా లేదని సీఎం పేర్కొన్నారు.
 
లాక్డౌన్ విధిస్తే ప్రజలకు కష్టాలు తప్పవని, వ్యాపారులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారని, కాబట్టి లాక్డౌన్ ఆలోచనలను మానుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే లాక్డౌన్ భయంతో వలస కూలీలు భయంతో తమతమ సొంతూళ్ళకు వెళ్లిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ వంశస్థుడైన బీజేపీ ఎంపీ ఉదయన్ రాజే భోస్లే కూడా లాక్డౌన్ వద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాక, పళ్లెం పట్టుకుని రోడ్డు మీద కూర్చుని భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన రూ.450ని జిల్లా అధికారులకు అందిస్తూ లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీకా ఉత్సవ్‌.. కరోనాపై రెండో యుద్ధానికి నాంది : ప్రధాని మోడీ