Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

తెలంగాణాలో 3 వేలు దాటిన కరోనా కేసులు... మృతులు ఎంతమంది?

Advertiesment
తెలంగాణాలో 3 వేలు దాటిన కరోనా కేసులు... మృతులు ఎంతమంది?
, ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (12:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 3,187 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను ఆదివారం ఉదయం విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278కి పెరగగా.. మరణాల సంఖ్య 1,759కి చేరింది.
 
కాగా.. గత 24 గంటల్లో కరోనా నుంచి 787 మంది కోలుకున్నారు. వీరితో కలిపి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,05,335కి చేరింది. నిన్న అత్యధికంగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 551, మేడ్చల్‌ జిల్లాలో 333, రంగారెడ్డి జిల్లాలో 271 నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 1,15,311 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరితో కలిపి ఇప్పటివరకూ 1,09,88,876 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాది కరోనా తీవ్రతను దాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 
 
ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదుకాగా 794 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 1,32,05,926 మందికి కరోనా సోకగా.. 1,68,436 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి.
 
మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ భయాందోళనలకు గురిచేస్తోంది. ఇక్కడ కొత్తగా 55,411 కరోనా కేసులు నమోదుకాగా 309 మంది మరణించారు. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక్కరోజే 9,327 మంది కరోనా బారినపడగా.. 50 మంతి మృతి చెందారు. 
 
గుజరాత్‌లో కొత్తగా గుజరాత్‌లో 5,011 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మృతిచెందారు. ఇక తమిళనాడు విషయానికొస్తే ఇక్కడ కొత్తగా 5,989 మంది కరోనా బారిన పడగా వీరిలో 23 మంది మృత్యువాత పడ్డారు. 
 
కర్ణాటకలో కొత్తగా 6,955 కేసులు నమోదుకాగా 36 మృతిచెందారు. ఛత్తీస్‌గడ్‌లోనూ కరోనా కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ కొత్తగా 14,098 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 97 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాలన్లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ కలకలం సృష్టిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో కరోనా కల్లోలం.. కరోనా దెబ్బకు కాంగ్రెస్ అభ్యర్థి మృతి