సామాన్యులపై ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలు భారం మోపాయి. తాజాగా పాల ధరలు కూడా పెరగనున్నాయి. ముందుగా సంగం పాల ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొద్దిగా ధర పెంచుతున్నట్లు సంగం డెయిరీ ప్రకటించింది. లీటర్ పాలకు రూ.2 చొప్పున పెంచుతున్నారు. పాల ఉత్పత్తుల ధరల్లో మాత్రం మార్పు లేదన్నారు. ఈ ఒక్క కంపెనీ ధర పెంచినా చాలు.. మిగతా కంపెనీలు కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
పాల ధరలే కాదు.. ఏప్రిల్ 1 నుంచి చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆర్థికంగా భారం పెరుగుతుంది. జేబుకి చిల్లు పడుతుంది. ఈ సంవత్సరం కూడా ఏసీలు, టీవీల ధరలు పెరగనున్నాయి. అలాగే రిఫ్రిజిరేటర్స్, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్ల ధరలూ పెరగనున్నాయి. టీవీల ధరలు కనీసం రూ.2వేల నుంచి రూ.3వేల మధ్య పెరిగే అవకాశం వుంది.