తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న హరీష్ రావు కుటుంబం పాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. హరీష్ రావు సతీమణి శ్రీనిత ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. మిల్చి మిల్క్ పేరుతో తయారు చేసిన పాల ఉత్పత్తులను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు, ప్యాకింగ్ స్టేషన్ల ద్వారా సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో వినియోగదారుల ఇంటి వద్దకే తాజా, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.