యూపీలోని గౌతమ్‌బుద్ధ్ నగర్‌కు చెందిన సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈవ్‌టీజింగ్ కారణంగా ఆమె మరణించినట్టు అందరూ భావిస్తున్నారు. ఇంకా యువతి ప్రయాణించిన మోటరు సైకిల్‌ను ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు వాళ్ల మామయ్య నడుపలేదని, ఇటీవలే హైస్కూల్ విద్యను పూర్తిచేసిన మైనర్ బాలుడు నడిపాడని పోలీసులు తెలిపారు.
అమెరికాలో స్కాలర్‌షిప్‌తో చదువుతున్న భాటి మరణించడం వల్ల పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ డబ్బు రావడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే వాహనాన్ని మైనర్ బాలుడు నడుపలేదని కుటుంబసభ్యులు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే దీన్ని ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈవ్ టీజింగ్ కూడా జరిగినట్టు ఏమీ ఆధారాలు కనిపించలేదన్నారు. మరోవైపు, 15 మోటరు వాహనాలను బుధవారం స్టేషన్‌కి తీసుకొచ్చి వాటి యజమానులను ప్రశ్నిస్తున్నట్టు వివరించారు.