Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నక్షత్ర హోటల్‌ రేవ్ పార్టీలో కొత్త కోణాలు ... ఉక్రెయిన్ మహిళతో...

Advertiesment
నక్షత్ర హోటల్‌ రేవ్ పార్టీలో కొత్త కోణాలు ... ఉక్రెయిన్ మహిళతో...
, మంగళవారం, 7 జులై 2020 (12:39 IST)
కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ నక్షత్ర హోటల్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఈ రేవ్ పార్టీని సంతోష్ రెడ్డి అనే వ్యక్తి తన స్నేహితుల కోసం నిర్వహించారు. ఇందుకోసం ఆ హోటల్‌లో ఓ గదిని ఓ మహిళ పేరుతో బుక్ చేశారు. 
 
ఆ మహిళ ఉక్రెయిన్ దేశానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈమె గత నాలుగు నెలలుగా ఇదే హోటల్‌లో ఉంటూ వస్తోంది. పైగా, ఈమె సంతోష్ రెడ్డికి మేనేజరుగా పని చేస్తూ వస్తోంది. ఆమెతో పాటు.. తన స్నేహితుల కోసం సంతోష్ రెడ్డి ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈయన ఓ తెలంగాణాకు చెందిన మంత్రికి బంధువు అని తెలుస్తోంది.
 
ఈ క్రమంలో బంజారా హిల్స్ పోలీసులు తమ పెట్రోలింగ్ చర్యల్లో భగాంగా గత శనివారం రాత్రి హోటల్‌లోని తనిఖీ చేయగా, ఓ గదిలో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు గుర్తించి, అక్కడకు వెళ్లారు. ఆ గదిలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియా బాటలో అమెరికా : చైనా యాప్స్‌పై నిషేధానికి చర్యలు?