Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాపై 143 మంది అత్యాచారం చేశారు.. నగ్న నృత్యం చేయించారు.. యువతి ఫిర్యాదు

Advertiesment
Hyderabad
, శనివారం, 22 ఆగస్టు 2020 (11:06 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ దళిత యువతిపై యేళ్ళ తరబడి ఏకంగా 143 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత యువతి చెబుతోంది. ఈ మేరకు ఆమె హైదరాబాద్ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా, తాను గర్భందాల్చడంతో అబార్షన్ కూడా చేయించారని, నగ్నంగా నృత్యం చేయిస్తూ పైశాచికానందం పొందారని ఫిర్యాదులో పేర్కొంది. 
 
పోలీసులకు ఇచ్చిన 100 పేజీల ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, '143 మంది ఏళ్ల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించారు. నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతో పాటు సినీ పరిశ్రమ వారూ ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది' అని ఓ యువతి పేర్కొంది. 
 
తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగాయని తెలిపింది. వారు తనను వదిలిపెట్టరని, ఇదే చివరి వాంగ్మూలమని పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద 143 మందిపై కేసు నమోదు చేశారు.
 
నిందితుల్లో ఓ మాజీ ఎంపీ పీఏ కూడా ఉన్నారు. ఫిర్యాదులో యువతి పేర్కొన్న వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతికి మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో 2009 జూన్‌లో వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులు తట్టుకోలేక 2010 డిసెంబరులో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. 
 
పుట్టింట్లో ఉండి చదువుకుంటుండగా విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలువురితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం క్రితం రాజ్‌భవన్‌ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో తనపై మాజీ ఎంపీ పీఏ, విద్యార్థి సంఘం నాయకులు ముగ్గురు, మరో 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చనిపోయేముందు 10 మందిని రక్షించి : నాన్న.. నేను చనిపోయినా చనిపోవచ్చంటూ ఫోన్!