Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి.. బాలికతో మాత్రలు మింగించి..

Advertiesment
మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి.. బాలికతో మాత్రలు మింగించి..
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:02 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. హైదరాబాద్ పరిధి లోని కుల్సుంపురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన ఓ మైనర్ బాలికపై రోహన్ అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బోనాల ఉత్సవాల్లో మైనర్ బాలికతో రోహన్ పరిచయం పెంచుకున్నాడు. బాలికతో బలవంతంగా యువకుడు మాత్రలు మింగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువకుడితో తమకు ప్రాణ హాని ఉందని కుల్సుంపూర పోలీస్ స్టేషన్‌లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న కుల్సుంపూరాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రోహన్ పరారీలో ఉన్నాడు.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాం క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం - కరోనాకు దిలీప్ కుమార్ తమ్ముడు మృతి