Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో విశాల్ చేసుకుంటానంటే నేనే వద్దన్నా: మీరామిథున్ సంచలనం

Advertiesment
Kollywood hot news
, గురువారం, 20 ఆగస్టు 2020 (12:19 IST)
ఎందుకోగానీ ఈమధ్య కాలంలో హీరో విశాల్ ఆరోపణలకు గురవుతున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో నటి మీరామిథున్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనను పెళ్లాడుతానంటూ గత రెండుమూడేళ్లుగా హీరో విశాల్ తన వెంటబడ్డాడని ఆమె వ్యాఖ్యానించింది.
 
విశాల్ అంటే తన తల్లికి ఎంతో ఇష్టమనీ, ఎలాగూ వెంటబడుతున్నాడు కదా పెళ్లాడమని తన తల్లి చెప్పినా తను మాత్రం చేసుకోనని చెప్పానంది. కారణం ఏంటంటే.. డబ్బుండి బాగా ధనవంతుడుగా వున్న వ్యక్తిని పెళ్లి చేసుకోరాదని తను నిర్ణయించుకున్నాననీ, అందువల్ల పెళ్లికి నో చెప్పానంటూ కామెంట్లు చేసింది. ఇపుడీ కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
 
ఇదిలావుంటే గతంలో ఈమె హీరో విజయ్, సూర్యలపై కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసింది. అప్పట్లో మీరామిథున్ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను హెచ్చరించాడు. అయినా ఈమధ్యనే రజినీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి కూడా విమర్శనాస్త్రాలు సంధించింది మీరా. తాజాగా విశాల్ పైన టార్గెట్ పెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో వెంటబడ్డాడు... కానీ...