Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొదటి డోస్ కోవీషీల్డ్ వేసుకున్నా, రెండో డోసు కోవాక్జిన్ వేసుకోవచ్చా?

మొదటి డోస్ కోవీషీల్డ్ వేసుకున్నా, రెండో డోసు కోవాక్జిన్ వేసుకోవచ్చా?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:14 IST)
టీకాలు తీసుకున్నవారికి ఎన్నో సందేహాలు వస్తున్నాయి. కొంతమంది మొదట ఒక టీకా తీసుకున్న తర్వాత రెండోసారి అదే దొరకడంలేదు. అలాగే టీకా తీసుకుంటే ఇక కరోనా రాదనే అపోహలో చాలామంది వుంటున్నారు. దీనిపై ప్రముఖ వైద్యులు ఇచ్చిన సమాధానాలు.
 
ప్రశ్న: డాక్టర్ గారూ వాక్సిన్ పట్ల చాలా మందిలో చాలా రకాల భయాలు ఉన్నాయి.రెండో డోస్ అయిపోయాక కూడా కరోనా వచ్చిందని,వాక్సిన్ వల్ల ఉపయోగం ఏమీ లేదని,వాక్సిన్ వేసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని లాంటి రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ అపోహలేనా?లేక వాస్తవాలు ఉన్నాయి అంటారా?
 
సమాధానం: అవన్నీ నూటికి నూరుపాళ్లు అపోహలే.. వాక్సిన్ వేసుకున్నాక కూడా కోవిడ్  వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు.రాకుండా ఉండటానికి వాక్సిన్ లో ఉన్నది కరోనాకు మందు కాదు కదా.. వాక్సిన్లో నిర్వీర్యం చేసిన వైరస్ ఉంటుంది. అది మన శరీరంలోకి రాగానే మన శరీరం స్పందించి వాటిని ఎదుర్కోడానికి ఆంటీబాడీసు ఉత్పత్తి చేస్తాయి.. ఈ ఆంటీబాడీసు ఈసారి నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటాయి..
 
కరోనా రాకుండా ఆపగలిగేది మాస్కు, సోషల్ డిస్టెన్సింగ్ మాత్రమే.. వచ్చాక దానితో  పోరాడటానికి ఉపయోగ పడేది వాక్సిన్. అంతేగానీ వాక్సిన్ వేసుకుంటే కరోనా రాదు. వచ్చిందంటే వాక్సిన్ పని చేయట్లేదు అనేది కేవలం అపోహ మాత్రమే. మాస్కు , వాక్సిన్ తప్ప ప్రస్తుతానికి మనకు వేరే మార్గాలు లేవు .
 
ప్రశ్న- నేను మొదటి డోసు కోవిషీల్డు వేసుకున్నా..ఇపుడది దొరకలా..కోవాక్సిన్ వేసుకోవచ్చా.?
 
సమాధానం- వేసుకోకూడదు..మొదట ఏమి వేసింటే అదే వేసుకోవాల,,రెండు వ్యాక్సిన్ ల తయారీ టెక్నాలజీ వేరు వేరు.. 
 
ప్రశ్న - నేను మొదట కోవిషీల్డు వేసుకున్నా..ఇపుడు పొరపాటున కోవాక్సిన్ వేసుకున్నా, ఏంచేయాలి.. ఏమన్నా అవుతుందా.
 
సమాధానం - ఏమి అవదు... ఒక నెల ఆగి కోవాక్సిన్ రెండవ డోసు వేసుకోండి.
 
 
ప్రశ్న - కోవిడ్ వచ్చి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయాను.. వాక్సిన్ వేసుకోవచ్చా?
 
సమాధానం- అవసరం లేదు..రెండు లేదా మూడు నెలల తరువాత వేసుకోవాలి..మీలో రక్షణ వ్యవస్థ ఆక్టివేసషన్ లో ఉంటది... WHO 6 నెలలు ఆగమంది..
 
ప్రశ్న- నేను వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా..నా ఫ్రెండుకు పాజిటివ్ వచ్చింది,,నేను పరీక్ష చేసుకోవాలనా? ఎపుడు చేసుకోవాల?
 
సమాధానం- పాజిటివ్ వచ్చేది 4-7 రోజుల మధ్య ఎక్కువ .. ఈ మధ్యలో ఉండి లక్షణాలుంటే చేసుకోండి,.ముందు ఐసోలేషన్ లో ఉండి లక్షణాలను గమనించండి....
 
ప్రశ్న- నాకు వ్యాక్సిన్ అంటే నమ్మకంలేదు.. చావంటే భయమూ లేదు.. నేనెందుకేసుకోవాల.. వేసుకోను..
 
సమాధానం- నాకు చావంటే భయం లేదు.. కాని మనకు కోవిడ్ వస్తే మొదటి మూడు రోజులలో చాలా మందికి అంటిస్తాము. నీకు వైద్యం చేసే వైద్యసిబ్బంది అందరికీ రిస్కు ఉంటాది... నీ ప్రాణాం మీద నీకు దిగులు లేక పోయినా ప్రజలు మరియు వైద్యసిబ్బంది ప్రాణాలతో చెలగాటమాడే ప్రాధమిక హక్కు నీకు రాజ్యాంగం ఇవ్వలేదు. కావున తప్పక వేసుకోవాల.. అది నీ సామాజిక బాధ్యత..కంపల్షన్.. అంతే.
 
Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS),
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, 
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ బారిన పడగలిగే ప్రదేశాలను గుర్తించడం ఎలా?