Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ బారిన పడగలిగే ప్రదేశాలను గుర్తించడం ఎలా?

Advertiesment
corona virus
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (10:07 IST)
కరోనా రోగి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా గాలిలోకి వేల కొలది సూక్ష్మ తుంపర్లు లేదా నీటి బిందువులు విడుదల అవుతాయి. ప్రతీ బిందువులో లక్షల కొలది కరోనా వైరస్లు నిండి ఉంటాయి. అవి సాధారణంగా అయితే కొంత దూరంలో నేల మీదకు పడిపోవాలి. కానీ జరుగుతున్నదేమిటంటే ఆ తుంపర్లు గాలిలో ఉండే సూక్ష్మ ధూళి రేణువులను అంటిబెట్టుకుని వాటితో పాటు తేలుతూ గంటల కొద్దీ గాలిలోనే ఉంటున్నాయి. ఆ గాలి పీల్చిన వారి శరీరంలోకి ప్రవేశించి వారికి కరోనా సోకడం జరుగుతుంది.
 
వీటిలో ఏవీ కూడా (సూక్ష్మ తుంపర్లు, ధూళి రేణువులు, కరోనా వైరస్లు) కంటికి కనిపించకపోవడం వలన మరియు మనం వైరస్ వ్యాప్తి చెందే ప్రక్రియను సరిగా అర్ధం చేసుకోకపోవడం వలన కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రక్రియను అర్ధం చేసుకుని కరోనా సంక్రమించ గలిగే ప్రదేశాలను పసిగట్టగలగడం అనేది ప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరం.  కొన్ని సందర్భాలను విశ్లేషిస్తే ఇది మనకు సులభంగా అర్ధం అవుతుంది.
 
మీరు కొంత మందితో ఒక గదిలో సమావేశం జరపాలి. ఏసీ ఉన్న గది - ఫ్యాన్ ఉన్న గది. వీటిలో ఏది సురక్షితం? జవాబు - ఫ్యాన్ ఉన్న గది. ఎందుకంటే ఏసీ ఉన్న గది అన్ని వైపుల నుండి మూయబడి ఉంటుంది. అక్కడ గాలి కదలదు. ఆ రూములో ఒక్క రోగి ఉంటే చాలు కొంత సేపటికి గదిలోని గాలి వైరస్ బిందువులతో నిండిపోతుంది. మిగతా వారికి కరోనా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ.
 
కిటికీలు తెరిచి ఉన్న గది - కిటికీలు మూసి ఉన్న గది. వీటిలో ఏది సురక్షితం? జవాబు - కిటికీలు తెరిచి ఉన్న గది. బయటి నుండి వచ్చే గాలి వలన రూములోని గాలిలో వైరస్ బిందువులు నిర్మూలించబడతాయి.
 
ఆసుపత్రులలోని గాలి సురక్షితమా? జవాబు - కాదు.. ఆ గాలి ఫిల్టరేషన్ ద్వారా శుద్ధి చేయబడే వ్యవస్థ ఉంటే తప్ప.
 
సినిమా హాళ్ళు సురక్షితమా బహిరంగ ప్రదేశాలు సురక్షితమా? జవాబు - బహిరంగ ప్రదేశాలలో గాలి వీస్తూ ఉంటుంది కాబట్టి అవే సురక్షితం. సినిమా హాళ్ళలోని గాలి వైరస్ బిందువులతో నిండి ఉంటుంది.
 
వస్తువుల, ఉపరితలాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ అని, గాలిలో తేలుతున్న బిందువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువని పరిశోధనలు నిగ్గు తేల్చాయి. అయితే మనం ఉపరితలాల ద్వారా వ్యాప్తిని అరికట్టడానికి శ్యానిటైజర్లు వాడడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం లాంటివి చేస్తూ చాలా జాగ్రత్త పడుతున్నాం కానీ (గాలి ద్వారా) వ్యాప్తి అసలు ఎక్కువగా జరిగే ప్రదేశాలకు వెళుతూ వైరస్ బారిన పడుతున్నాము
 
అయితే ఇతరులతో మాట్లాడకుండా ఉండడం, మూసి ఉన్న గదులలోకి వెళ్ళకుండా ఉండడం అన్ని వేళలా సాధ్యం కాదు కాబట్టి ఒకవేళ అవి చేయవలసి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
మూసి ఉన్న గదులలో గడిపే సమయాన్ని బాగా తగ్గించాలి. 10 నిమిషాల లోపు ఉండాలని పరిశోధనలు చెపుతున్నాయి. 
 
మంచి నాణ్యత ఉన్న మాస్కులు ధరించాలి. కేవలం క్లాత్ మాస్క్ ఒక్కటే వాడితే రక్షణ కేవలం 40% అని., డబల్ మాస్క్ (లోపల సర్జికల్ మాస్క్, బయట క్లాత్ మాస్క్) వాడితే 80% రక్షణ ఉంటుందని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి. లేదా ఒరిజినల్ N95 మాస్కులు వాడాలి. 
 
అవగాహనతో మసలుకుందాం., వైరస్ వ్యాప్తిని అరికడదాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు, ఉసిరి పొడి రెండూ సమానంగా కలిపి అర చెంచా పొడి రోజూ తీసుకుంటే?