Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్ర విసర్జన కాలం ఎంత వుండాలో తెలుసా?

మనిషి సగటున రోజుకు ఏడుసార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఏడుసార్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా మూత్ర విసర్జన చేస్తే ఏదో తెలియని అనారోగ్యం వున్నట్లే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన కాలం దాదాపు ఏడు సెకన్ల వరకూ వుంటుంది. మూత్ర విసర్జన చేయాలనిపించినపుడు

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (14:35 IST)
మనిషి సగటున రోజుకు ఏడుసార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఏడుసార్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా మూత్ర విసర్జన చేస్తే ఏదో తెలియని అనారోగ్యం వున్నట్లే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన కాలం దాదాపు ఏడు సెకన్ల వరకూ వుంటుంది. మూత్ర విసర్జన చేయాలనిపించినపుడు మూత్రానికి వెళితే రెండు సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలోపలే మూత్ర విసర్జన పూర్తయితే వారికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పుకోవచ్చు. 
 
మన తీసుకునే ఆహారాన్ని శరీరం వివిధ రకాలుగా విడగొడుతుంది. ఇలా విడగొట్టబడిన ఆహారంలో శరీరం వివిధ పోషకాలను గ్రహించి మిగిలిన వ్యర్థాలను మూత్రం, మల రూపంలో విసర్జిస్తుంది. ఇక మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని చెప్పొచ్చు. మీ మూత్రం తెల్లగా స్వచ్ఛంగా ఉంటే మీరు శరీరానికి సరిపోయినన్న నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం ఎరుపు రంగులో వస్తే దీనికి కారణం మూత్రంలో రక్తం కలిసి విసర్జితమవ్వడం. ఇది చాలా సంధర్భాల్లో యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు గాని దీన్ని ఒక సమస్యగా తీసుకోవాలి.
 
కొంతమందికి మూత్రం నీలంరంగులో వస్తుంది. ఇది పసిపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బ్లూ సైపన్ సిండ్రోమ్ అంటారు. ఇది జన్యులోపం కారణంగా వస్తుంది. పెద్దవారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం నలుపు రంగులో ఉంటుంది. మూత్రం జేగురు రంగులో వస్తే చర్మం, మెడ ఇన్ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడిందని అర్థం. ఇలాంటి పరిస్థితి పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. యాంటీ బయాటిక్ వాడడం ద్వారా దీని నుంచి బయట పడవచ్చు. డీహైడ్రేషన్ కు లోనయితే అది ముదురు రంగులోకి మారుతుంది. లివర్ సమస్యలు, కామెర్ల సమస్యలు ఉంటే మూత్రం ముదురు పసుపురంగులోకి వస్తుంది. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా మూత్రం పసుపు రంగులో వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments