Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెసరట్టు తింటే అందంగా వుంటారట..

పెసరట్టు అంటేనే లొట్టలేసుకుని.. పచ్చడితో నంజుకుని తినేస్తున్నారా? అయితే ఆరోగ్యానికి మీరు మేలు చేసినవారవుతారు. పెసలుతో ఎన్నో వంటకాలు రుచిచూసి వుంటారు. అలాంటి పెసళ్లలో ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు, యాంటీ

Advertiesment
Mung Beans
, శుక్రవారం, 8 డిశెంబరు 2017 (15:34 IST)
పెసరట్టు అంటేనే లొట్టలేసుకుని.. పచ్చడితో నంజుకుని తినేస్తున్నారా? అయితే ఆరోగ్యానికి మీరు మేలు చేసినవారవుతారు. పెసలుతో ఎన్నో వంటకాలు రుచిచూసి వుంటారు. అలాంటి పెసళ్లలో ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు. సౌందర్య పోషణకు ఉపయోగపడుతుంది. పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు వయసుకన్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు. ఇందులో అధిక కాపర్‌వల్ల చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది. 
 
పెసల్లో విటమిన్‌-సి పుష్కలంగా ఉంది. తద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. చర్మాన్ని కోమలంగా వుంచుతాయి. యాంటీ ఏజెంట్‌గా పెసళ్లు పనిచేస్తాయి. తద్వారా నిత్య యవ్వనులుగా వుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మధుమేహంతో బాధపడేవారికి పెసలు చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర పరిమాణాన్ని సమతులం చేస్తాయి. వీటిలో ఉండే పీచుపదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
  
పెసళ్లలో వుండే కాల్షియం ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిల్లో పోషకాలు ఎక్కువ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెసలు గుండెజబ్బుల్ని నిరోధిస్తాయి. క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది. పెసళ్లను మొలకల రూపంలోనో లేకుంటే ఉడికించి తిన్నా.. కాలేయం, కేశాలు గోళ్లు, కళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పు కలిపిన పల్లీలు తింటున్నారా?