Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెల్లగా మల్లెపువ్వులాంటి అన్నం... అందులో ఏముందో తెలుసా?

పూర్వం మన పూర్వీకులు వడ్ల గింజలను దంచి వచ్చిన బియ్యంతో అన్నం వండుకునేవారు. దానివల్ల వారికి రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం తెల్ల బియ్యంను ఆశ్రయించి అనారోగ్యం పాలవుతున్నాము. ఎప్పటినుండైతే మనిషి మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుండి బియ్యాన్

తెల్లగా మల్లెపువ్వులాంటి అన్నం... అందులో ఏముందో తెలుసా?
, గురువారం, 7 డిశెంబరు 2017 (20:35 IST)
పూర్వం మన పూర్వీకులు వడ్ల గింజలను దంచి వచ్చిన బియ్యంతో అన్నం వండుకునేవారు. దానివల్ల వారికి రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం తెల్ల బియ్యంను ఆశ్రయించి అనారోగ్యం పాలవుతున్నాము. ఎప్పటినుండైతే మనిషి మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుండి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలుపెట్టాడు. బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే  ఆ బియ్యంపై ఒక పొరను తీసివేస్తుంది. దీనిని మనం మొదటి పాలిష్ అంటాము. దీని వలన బియ్యంలో అతి ముఖ్యమైన పోషక పదార్థాలు 5 శాతం వరకూ పోతాయి. 
 
ఇవి ముఖ్యంగా 12 రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ, పీచుపదార్థాలు, లిసిథిన్ మొదలైనవి. ఈ మొదటి పాలిష్ పోతాయి. దీని నుండి వచ్చిన తౌడును మందుల కంపెనీవారు కొనుక్కొని మందుల తయారీకి వాడతారు. మొదటి పాలిష్ వలన బియ్యము మరీ తెల్లగా రావు. వీటిని మరలా రెండవసారి పాలిష్ వేస్తారు. వీటి వలన బియ్యం తెల్లగా వచ్చి వీటి నుండి 30 శాతం పోషక పదార్థాలు పోతాయి. వీటినుండి వచ్చిన తౌడును గేదెలకు, ఆవులకు, ఇతర జంతువులకు, చేపలకు, రొయ్యలకు బలానికి వాడతారు. ఇంక ఆ తెల్లబియ్యాన్ని మాత్రం మనం ఆనందంగా తింటున్నాము. తెల్లటి బియ్యం వలన మనకు అనేక నష్టాలు ఉన్నాయి.
 
1. బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80 శాతం పైగా కోల్పోయి కేవలం15.20 శాతం మాత్రమే మిగులుతాయి. శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్లు సరిగా లేకపోవడం వలన త్వరగా అలసిపోవడం, నీరసం రావడం, పిక్కలు లాగటం, పనిచేయలేక పోవటం జరుగుతుంది.
 
2. లిసిథిన్ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, కొలెస్ట్రాల్, పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు ఉపయోగపడుతుంది. తెల్లని బియ్యం తినేవారికి ఈ రక్షణ శరీరంలో వుండదు. అంతేకాదు పైపొరల్లో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తుంది.
 
3. పీచు పదార్థాలు పైపొరలో వుండటం వల్ల మనం తినే తెల్లబియ్యం వలన మలబద్దకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు. తెల్లని బియ్యం మెతుకులు సన్నగా ఉండటం వలన సరిగా నమలకుండా మింగేస్తాము. దాని వలన జీర్ణప్రక్రియ జరగదు, అంతేకాదు దీనివలన కాళ్ళకు నీరు రావడం, తిమ్మర్లు రావడం జరుగుతుంటాయి. మనలో కొంతమంది ముడిబియ్యం అరగదనేది అపోహ మాత్రమే, మనం గోధుమలు, రాగులు, జొన్నలను కూడ వండుకుని తినవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహానికి మందులు అక్కర్లేదట.. ఇలా చేస్తే చాలట..