Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఋతువులు , ఆయా సమయాల్లో పాటించవలసిన ఆహార విహార నియమాలు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:49 IST)
వసంత ఋతువు  - 
వసంత ఋతువు నందు కఫము ప్రకోపించి అనేక రోగములను కలుగజేయును . అందువలన  అట్టి కఫముని వాంతి , ముక్కు ద్వారా , విరేచనం ద్వారా కఫాన్ని పోగొట్టి కఫాన్ని తగ్గించవలెను.  ఈ సమయంలో పాతవి అయిన గోధుమలు, శొంటి, వేగిసచెక్క , చందనము , తుంగముస్తలు కాచబడిన నీళ్ళనిగాని , తేనె కలిపిన నీళ్ళని గాని పానము చేయవలెను.
 
ప్రాతఃకాలం సమయమున శరీరం మర్దించుకొని నలుగుపెట్టుకొని స్నానం చేయవలెను . మధ్యాహ్నమున నీటికాలువుల యందు , చెట్లు ఎక్కువ ఉన్న తీగలు గల చెట్లు ఉన్న ఉద్యాన వనాల యందు గడపవలెను. వసంత ఋతువు యందు చల్లటి పదార్థాలు , మధురపదార్థాలు , సేవించరాదు . పగలు నిద్రించరాదు.
 
గ్రీష్మ ఋతువు
ఈ గ్రీష్మ ఋతువు నందు తీక్షణమైన సూర్యప్రకోపం వలన శరీరం నందు కఫం తగ్గిపోయి వాతం పెరుగును . ఈ ఋతువు నందు ఉప్పు , కారం , పులుపు కలిగిన పదార్థాలు , వ్యాయామం , సూర్యకిరణాల యందు కూర్చోవడం నిషేదించవలెను . 
 
ఈ కాలం నందు మధురపదార్థాలను మాత్రమే వాడవలెను . పంచదారతో కూడిన పేలాల పిండి మొదలగు పదార్థాలు తినవలెను . రాత్రిసమయంలో వెన్నెలలో ఆరుబయట ఉంచబడిన గేధ పాలలో పంచదార వేసుకొని అవి తాగవలెను .
 
మధ్యాహ్న సమయం నందు చెట్లు ఉండి నీడ ఎక్కువ గల ప్రదేశాలలో పైనుంచి నీరు జాలువారే విధంగా జలగృహము నిర్మించుకొని అందు నివసించవలెను . రాత్రి సమయంలో మేడ పై భాగాల్లో వెన్నెల లో లేదా ఆరుబయట ఉండవలెను . 
వర్షఋతువు  - 
వర్షఋతువు నందు ఆకాశం మేఘాలతో ఆవరించబడి ఉండినప్పుడు జలకణములతో కూడి ఉండునట్టియు , వేసవికాలం తరువాత చల్లాగా అయినట్టి గాలి వలన లోపల ఉండు వాతం దోషం పొందును. భూమి యొక్క ఉష్ణం కాల స్వభావం చేత ఆమ్ల స్వభావం పెరిగినటువంటి జలం తాగుట చేత శరీరం నందలి పిత్తం దోషం పొందును. సాలె పురుగులు మొదలగు విష మూత్రాదులతో కలిసి ఉన్న వర్షపు నీరు సేవించుట చేత కాలస్వభావం చేత మందంగా ఉన్న జఠరాగ్ని వలన కఫం దోషం పొందును. 
 
ఈ విధంగా ఒకే కాలం నందు వాత, పిత్త, కఫాలు మూడు ఒకేసారి దోషం పొందుట వలన వాటిని శమింపచేయునట్టి మరియు జఠరాగ్ని పెంచే ఆహారాలు ఉపయోగించవలెను. ఈ కాలం నందు పాతవైన యావలు , గొధుమలు , నేతితోను , శొంఠితోను చేయబడిన మాంసరసం , పెసరకట్టు , చాలా కాలం నుంచి నిలువ ఉంచబడిన మద్యం , వర్షం నుంచి పడిన నీరు , బావినీరు , కాచిన నీరు వీటిని ఉపయోగించాలి . ఈ ఋతువునందు అధిక శ్రమ చేయక శరీరం నందు గంథం పూసుకొని , సుగంధ ద్రవ్యముల ధూపమును వేసుకొని మేడ యందు నివశించవలెను . 
 
ఈ వర్షాకాలం నందు నదీజలం , కడుపు నిండా తినడం , పగటినిద్ర , శ్రమ ఎక్కువుగా ఉండే పనులు , ఎండ వీటిని చేయరాదు . 
 
శరదృతువు 
శరదృతువు నందు పిత్త దోషం ప్రకోపించును . ఈ కాలం నందు చేదు , తీపి , వగరు కలిగినటువంటి ఆహారాలు లొపలికి తీసికొనవలెను . ఆకలి అయినప్పుడే పదార్థాలు తీసికొనవలెను . శాలి ధాన్యం , పెసలు, పంచదార, ఉసిరికాయ , చేదుపోట్ల , తేనె , హంసలు తిరిగే తటాకం నందలి నీరు ఉపయోగించవలెను . 
 
చందనం , వట్టివేరు , పచ్చకర్పూరం , ముత్యాల హారం , పుష్పాల దండలు , పట్టుబట్టలు వీటిని వాడవలెను . మేడ  పైభాగం నుండి సూర్యాస్తమయం అయిన సమయం లో వెన్నెలని సేవించవలెను . ఈ ఋతువు నందు మంచు , యావక్షారం వంటి లవణాలు , పెరుగు , నూనె , వస , ఎండ , ఘాటుగా ఉండు మద్యములు, పగటి నిద్ర , తూర్పుగాలి వీటిని వదిలివేయవలెను . 
 
హేమంత ఋతువు 
హేమంతఋతువు యందు మధురరసం , ఆమ్లరసం , లవణ రసం గల పదార్థాలు భుజించవలెను . ప్రాతఃకాలం నందు ఆకలిగా ఉన్నచో కొంచమే భుజించవలెను . వాతాన్ని హరించే  తైలములతో  అభ్యంగనం, శిరస్సు తైలముతో మర్దించుకొనుట, మల్లయుద్ధం , శరీరమునకు మర్దనం చేయించుకొనుట చేయవలెను . స్నానం చేసినతరువాత కుంకుమపువ్వుని , కస్తూరిని  కలిపినూరి శరీరంకి పూసుకుని అగరుచెక్కతో దూపం వేసుకొనవలెను . 
 
ఈ కాలం నందు బలకరమైన మాంసరసం , మాంసములు , బెల్లంతో చేసిన మద్యం , మధుర మద్యం , గోధుమపిండి , మినుములు , చెరుకుపాలు వీనితో చేయబడిన పదార్థాలు , నూతనమైన అన్నం , వస , తైలం వీటిని ఉపయొగించవలెను . స్నానం కొరకు వేడినీటిని మాత్రమే ఉపయొగించవలెను . చలిబాధ లేకుండా ఉండటం కొరకు దుప్పటి, కంబళి , శాలువ వీటిని కప్పుకొనవలెను . కొంతసమయం సూర్యకిరణముల యందు ఉండి చెమట పట్టే విధంగా చూసుకొనవలెను . భూగృహముల యందు నివశించవలెను . 
 
శిశిరఋతువు 
హేమంత ఋతువు నందు పాటించే నియమాలను ఈ ఋతువు నందూ పాటించవలెను. పైన చెప్పిన విధంగా ఆయా ఋతువుల్లో ఆయా ఆహారపదార్థాలని తీసుకోవడం , ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం వలన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments