Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు లాగించేస్తున్నారా?

వర్షాకాలం, శీతాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాల వేడిగా లాగించేస్తుంటాం. అయితే వర్షాకాలం, శీతాకాలంలో ఫ్రైడ్ ఆహార పదార్థాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (15:49 IST)
వర్షాకాలం, శీతాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాల వేడిగా లాగించేస్తుంటాం. అయితే వర్షాకాలం, శీతాకాలంలో ఫ్రైడ్ ఆహార పదార్థాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా నూనెలో వేయించిన పదార్థాలను వర్షాకాలంలో కానీ, శీతాకాలంలో కానీ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కాదు. 
 
ఇంకా ఫ్రై చేసిన ఆహారం తింటే ఇక అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంది. దాంతో అది గ్యాస్‌, అసిడిటీకి దారి తీస్తుంది. క‌నుక ఈ కాలంలో ఫ్రై ఫుడ్స్‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. అలాగే ఆకుపచ్చని కూరలు, ఆకుకూరలను కూడా వర్షాకాలం, శీతాకాలంలో తినకపోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి మేలు చేసినా.. వాటిలో వుండే క్రిములు, బ్యాక్టీరియాలతో ప్రమాదం వుంది. 
 
ఒకవేళ తినాలనుకునే వారు..  వేడినీటిలో ఐదు నిమిషాలుంచి శుభ్రపరిచి వండుకుని తినాలి. పచ్చిగా సలాడ్స్ రూపంలో తీసుకోకూడదు. ఇంకా రెస్టారెంట్లు, హోటల్స్‌లో అమ్మే తాజా పండ్ల రసాలను తీసుకోకూడదు. దానికి బదులు ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం మంచిది. ఇక ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వానాకాలం, శీతాకాలంలో తాగకూడదు. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. జీర్ణాశ‌యంలో ఉండే ఎంజైమ్‌ల ప‌నితీరుకు ఆటంకం క‌లుగుతుంది. క‌నుక వ‌ర్షాకాలంలో కూల్‌డ్రింక్స్‌ను తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. 
 
ఇంకా వానాకాలం, చలికాలంలో చేపలు, రొయ్యలు వంటివి తీసుకోకూడదు. ఈ స‌మ‌యంలో వాటిపై లార్వా, వైర‌స్‌లు, ఇత‌ర క్రిములు ఎక్కువ‌గా ఉంటాయి. ఇక మార్కెట్‌లో అమ్మే చేప‌లు, రొయ్య‌ల‌పై ఈ కాలంలో ఉండే తేమ కార‌ణంగా బాక్టీరియాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఓ ప‌ట్టాన పోవు. క‌నుక ఈ కాలంలో చేప‌లు, రొయ్య‌ల‌ను తిన‌కుండా ఉంటేనే బెట‌ర్. లేదంటే ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌తారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments