Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువును తగ్గించే అలసందలు..

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (17:19 IST)
ప్రకృతిలో మనకు సహజసిద్దంగా లభించే అలసందను బొబ్బర్లు అని కూడా అంటారు. అలసందలు రుచికరంగా, మంచి ఫ్లేవర్‌ను కలిగి ఉంటాయి. అలసందల్లో ఉన్న వివిధ రకాల పోషకాలు మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలకు సహాయపడతాయి. అవి తీసుకుంటే మనకు ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. 
 
అలసందల్లో తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ ఉంటుంది. బరువు తగ్గించడంలో మంచి ఆహారంగా సహాయపడుతుంది. అలసందల్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది . అందుకే బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. వీటిని తినడం వల్ల మీకు పొట్టనిండిన అనుభూతి కలుగుతుంది. అదనపు ఆహారం జోలికి వెళ్లరు. 
 
మధుమేహంతో బాధపడే వారికి లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తుంది మరియు ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుండి తొలగిస్తుంది. 
 
రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడమే కాకుండా, హార్ట్ సంబంధిత వైరస్ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్, పొటాషియం మరియు మెగ్నిషియం గుండె ఆరోగ్యానికి మంచిది. అలసందల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
 
వీటిలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ వలన చర్మానికి హాని కలగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగారం స్మగ్లింగ్ కేసు : అధికారులు కొట్టలేదు ప్రశ్నలతో వేధించారు : రన్యా రావు

Mother forget Baby: ఫోన్ మాట్లాడుతూ.. బిడ్డను పార్కులోనే వదిలేసిన తల్లి.. మేడమ్.. మేడమ్.. అంటూ?

Varma: నాగబాబు కోసం పిఠాపురం వర్మను పక్కనబెట్టేస్తే ఎలా? పవన్ అలా చేసివుంటే బాగుండేది?

తల్లిదండ్రుల నిర్లక్ష్యం: కోల్డ్ డ్రింక్ క్యాప్ మింగేసిన తొమ్మిది నెలల పసికందు.. మృతి

విమాన మరుగుదొడ్డిలో పాలిథిన్ కవర్లు - వస్త్రాలు.. విచారణకు ఏఐ ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

తర్వాతి కథనం
Show comments